Guru Margi 2022: దీపావళి తర్వాత ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు..
Guru Margi 2022: బృహస్పతి తిరోగమనడం వల్ల వృషభ రాశి, మిథునం రాశి, కర్కాటక రాశి, కుంభరాశి వారికి మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశుల వారు అనుకోకుండా ధనాన్ని పొందుతారు. ముఖ్యంగా దీపావళి రోజున వీరు ధనలక్ష్మికి పూజ చేయాల్సి ఉంటుంది.
Guru Margi 2022: అన్ని గ్రహాలు తప్పకుండా సంచారం చేస్తూ ఉంటాయి. అయితే బృహస్పతి జులై నెలలో తిరోగమనం చేయనుంది. తన సొంత రాసిన మీనరాశిలోకి ఈ బృహస్పతి గ్రహం ప్రవేశించనుంది. ఇలా తిరోగమనం చెందడం వల్ల నాలుగు రాశులపై ప్రభావం పడనుంది. ఈ గ్రహం దీపావళి రోజున మీన రాశిలోకి ప్రవేశించనంది. దీని ప్రభావం దాదాపు ఒక నెల దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఈ కారణంగా నాలుగు రాష్ట్రాల వారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.
ఏ రాశులపై ఈ ప్రభావం పడబోతోంది:
వృషభ రాశి:
బృహస్పతి గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి చాలా మంచిదని శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈ కారణంగా వీరి ఆదాయంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారంపరంగా మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి.
మిథున రాశి:
ఈ తిరోగమన ప్రభావం మిథున రాశిపై కూడా పడే ఛాన్స్ ఉంది. దీని కారణంగా వారు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా జాబ్ కోసం ట్రై చేస్తున్నవారు జాబులు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కష్టపడుతున్న వారు ప్రమోషన్స్ పొందుతారు.
కర్కాటక రాశి:
బృహస్పతి హీరోగమనం వల్ల కర్కట రాశి వారికి రాజయోగ గడియలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరికి ఈ నెల మొత్తం శుభ ఘడియలే.. ఈ సమయాల్లో వీరు ఏ పనులు చేసినా తప్పకుండా విజయం సాధిస్తారు. అనుకోకుండా వీరు దీనీ ప్రభావం వల్ల యాత్రాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.
కుంభరాశి:
తిరోగమన ప్రభావం కుంభ రాశి పై వారిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి దీపావళి తర్వాత మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు, కీర్తి, ప్రతిష్టలు పొందుతారు.
Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి