Guru Margi 2022: జాతకంలో ఏర్పడిన యోగాలతో పాటు గ్రహాల సంచారం వల్ల వ్యక్తుల జీవితాల్లో వివిధ రకాల మార్పులు సంభవిస్తాయి. ఈ సంచారం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడుతాయి. అయితే దీని ప్రభావం 12 రాశులపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల పలు రాశులవారి జీవితాలపై పెద్ద ప్రభావం పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  గ్రహాల సంచారం, గ్రహాల కలయికల వల్ల  గజకేసరి యోగం ఏర్పడితే అపారమైన సంపద, ప్రతిష్ట, పదవి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గజకేసరి యోగం వల్ల సమాజంలో రాజులగా జీవిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నవంబర్ 24వ తేదీన గురు గ్రహంలో ఏర్పడే పలు మార్పుల కారణంగా 3 రాశులపై ఈ యోగం ఏర్పడబోతోందని శాస్త్రం పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి గజకేసరి యోగం:
మేషం:

గురు గ్రహం ప్రత్యక్ష సంచారం వల్ల ఏర్పడుతున్న గజకేసరి యోగం మేష రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అనవసరమైన ఖర్చుల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా గ్రహ సంచారం వల్ల  కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త బాధ్యతలు పొందుతారు.


తుల:
మార్గశిర గురువు వల్ల ఏర్పడుతున్న గజకేసరి యోగం తులారాశి వారికి పెళ్లికాని వారికి అనేక ప్రయోజనాలను కలుగబోతున్నాయి. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారు సులభంగా జీవిత భాగస్వామి పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సంచారం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తిలో అధిక లాభాలు, వ్యాపారంలో లాభాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


వృశ్చికం:
వృశ్చిక రాశి వారు కూడా ఈ క్రమంలో చాలా రకాల లాభాలు పొందుతారని శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశి వారి గజకేసరి యోగం ఏర్పడే అవకాశాలున్నాయి. వ్యాపారాలలో లాభం,  పురోగతి సాధించవచ్చు. అంతేకాకుండా ఈ రాశులవారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. పోటీ పరీక్ష-ఇంటర్వ్యూ లలో విజయం సాధిస్తారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Also Read: Tulsi plant Tips: తులసి మొక్క మీ ఇంట్లో ఉందా..అయితే ఈ సూచనలు పాటించాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook