GURU MARGI IN NOVEMBER 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల గమనం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా దాని ఎఫెక్ట్ మెుత్తం 12 రాశులవారిపై శుభ మరియు అశుభంగా ఉంటుంది. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఏ రాశి అయినా సరే తిరోగమనంలో ఉంటే మంచి ఫలితాలను ఇవ్వదు. దీపావళి తర్వాత అంటే నవంబరు 24న గురుడు మీనరాశిలో తిరోగమనం నుంచి ప్రత్యక్ష సంచారంలోకి (Guru Margi in Capricorn 2022) రానున్నాడు. మీన రాశి యెుక్క ఈ మార్గం నాలుగు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు మార్గి ఈ నాలుగు రాశులకు శుభప్రదం
కుంభం (Aquarius)-జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభరాశి యొక్క రెండో ఇంటిలో బృహస్పతి సంచారం చేస్తాడు, ఇది ఈ రాశివారికి శుభప్రదం అవుతుంది. దీంతో వీరు భారీగా డబ్బును సంపాదిస్తారు. ఆఫీసులో మన పనికి ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో టీచింగ్, మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలు వింటారు. 
కర్కాటకం (Cancer)-ఈ రాశిచక్రం యొక్క తొమ్మిదవ ఇంట్లో గురు మార్గి ఉండబోతుంది. దీంతో ఈ రాశివారికి పూర్తిగా అదృష్టం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. బిజినెస్ లో మంచి లాభాలు ఉంటాయి. విదేశాల్లో వ్యాపారం చేసేవారు భారీ లాభాలను గడిస్తారు. 


మిథునం (Gemini)-జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశిచక్రం యొక్క 10 వ ఇంట్లో, బృహస్పతి సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. ఉద్యోగుస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారుస్తులు పెద్ద పెద్ద ఆర్డర్లును పొందుతారు. 
వృషభం (Taurus)- ఈ రాశిలోనే గురు మార్గి జరగబోతుంది. అంతేకాకుండా ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో బృహస్పతి సంచరిస్తాడు. దీంతో వీరి ఆదాయం భారీగా పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Dhanteras 2022: ధన్తేరస్, దీపావళి రోజు ఈ ఒక్క పని చేయండి.. లక్ష్మి దేవి మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook