Guru zodiac change November 2022: అంతరిక్షంలో గ్రహాల ప్రయాణం, తిరోగమనం మరియు సంయోగం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనంలో తిరోగమనంలో ఉన్నాడు. మరో నాలుుగు రోజుల్లో అంటే నవంబరు 24న ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. మీనంలో బృహస్పతి ప్రత్యక్ష కదలిక (Guru Margi 2022) వల్ల ఐదు రాశులవారు అపారమైన ప్రయోజనాన్ని పొందుతారు. వీరి అదృష్టం ప్రకాశించడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడామెరుగుపడుతుంది. బృహస్పతి సంచారం వల్ల ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి (Aquarius): బృహస్పతి కదలిక వల్ల కుంభరాశి వారి కోరికలు నెరవేరుతాయి. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. 


వృశ్చిక రాశి (Taurus): వీరికి గోల్డెన్ డేస్ ప్రారంభంకానున్నాయి. వృశ్చిక రాశివారు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్‌ లభిస్తుంది. 


వృషభం (Taurus): ఈ సమయం వ్యాపారానికి చాలా మంచిది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద మీరు మీ కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు.


కర్కాటం (Cancer): కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. వారి కెరీర్‌లో కొత్త దారులు తెరుచుకుంటాయి. వివాహం, వృత్తిలో ఇబ్బందులు తొలగుతాయి.


కన్య (Virgo): మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపారులకు లాభిస్తుంది. మీరు ప్రమోషన్ పొందుతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.


Also read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook