Jupiter transit 2022: మీనరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులపై డబ్బు వర్షం..
Jupiter transit 2022: దేవగురు బృహస్పతి నవంబర్ 24న మీనరాశిలో నేరుగా కదలనున్నాడు. దీంతో నాలుగు రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.
Jupiter Zodiac Change November 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మార్చుకుంటూనే ఉంటుంది. ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా, అది మొత్తం 12 రాశిచక్రాలను వేర్వేరుగా ప్రభావితం చేస్తుంది. దేవతల గురువుగా పిలువబడే బృహస్పతి ఈ నెల నవంబర్ 24న మీనరాశిలో (Guru Margi in Meena rashi) సంచరించబోతున్నాడు. ఆ రోజున గురుడు తిరోగమనం నుండి మార్గంలోకి రానున్నాడు. బృహస్పతి రాశి మార్పు వల్ల 4 రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది.
ఈ సంవత్సరం జూలై 29న మీన రాశిలో బృహస్పతి తిరోగమనం చేశాడు. నవంబర్ 24న ఇదే రాశిలో ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. సాధారణంగా గురు గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి సుమారు 1 సంవత్సరం పడుతుంది. మొత్తం 12 గ్రహాలలో బృహస్పతిని అత్యంత శుభ గ్రహంగా భావిస్తారు. సంపద, వైభవం, విద్య, పిల్లలు, ఆధ్యాత్మికత, వివాహం, గౌరవం మరియు అదృష్టానికి చిహ్నంగా బృహస్పతిని భావిస్తారు. మీనరాశిలో గురు మార్గి వల్ల ఏరాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
ఈ నాలుగు రాశులపై డబ్బు వర్షం
మీనరాశిలో గురుడి ప్రత్యక్ష సంచారం వల్ల కర్కాటకం, వృశ్చికం, కన్యా, వృషభ రాశుల వారి భవితవ్యం మారనుంది. వీరు వ్యాపారాల్లో భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు.
జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే...
ఆస్ట్రాలజీలో మీనం మరియు ధనుస్సు రాశులకు అధిపతిగా బృహస్పతి గ్రహాన్ని పరిగణిస్తారు. అందువల్ల ఈ రాశులవారిపై ఎల్లప్పుడూ ప్రత్యేక అనుగ్రహాన్ని కురిపిస్తాడు గురుడు. మీ జాతకంలో గురుడు అశుభస్థానంలో ఉంటే వారు కొన్ని పరిహారాలు చేయాలి. ప్రతి గురువారం శ్రీమహావిష్ణువును పూజించాలి. అలాగే పసుపు వస్తువులను దానం చేసి వీలైనంత వరకు గోవులకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల బృహస్పతి మీపై ఆశీర్వాదాలు కురిపిస్తాడు.
Also Read: Mangal Vakri 2022: ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే చాలు.. తిరోగమన కుజుడు మీకు ఊహించనంత ధనాన్ని ఇస్తాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook