Guru Margi 2022: దీపావళి తరువాత నడవనున్న గురుడు... ఈ 4 రాశులవారికి పెరగనున్న అదృష్టం..
Guru Margi 2022: దీపావళి తర్వాత గురుడు మీనరాశిలో సంచరించనున్నాడు. బృహస్పతి ప్రత్యక్ష సంచారం వల్ల నాలుగు రాశులవారికి అదృష్టం వరించనుంది.
Guru Margi 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలిక ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా, దాని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. మరో రెండు రోజల్లో దేశమంతా దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేవగురు బృహస్పతి స్థానంలో మార్పు రానుంది. ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో ఉన్న గురుడు...నవంబరు 24 నుండి నేరుగా నడవనున్నాడు. బృహస్పతి యెుక్క ఈ ప్రత్యక్ష సంచారం (Guru Margi in November 2022) నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
గురుడు ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు అనుకూలం
కుంభ రాశి (Aquarius): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభరాశి యొక్క రెండో ఇంట్లో బృహస్పతి సంచరించబోతున్నాడు. ఇది కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. విద్యారంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీరు భారీ మెుత్తంలో డబ్బును సంపాదిస్తారు.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సంచరించనున్నాడు. దీంతో ఈరాశివారికి అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారం నిమిత్తం వ్యాపరస్తులు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే మీరు భారీగా లాభపడతారు.
మిధునరాశి (Gemini): మిథునరాశి వారి పదో ఇంట్లో బృహస్పతి మార్గంలో ఉండనున్నాడు. దీంతో ఈ రాశివారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. వ్యాపారులు కొత్త డీల్స్ ను కుదుర్చుకుంటారు. డబ్బు లాభదాయకంగా ఉంటుంది.
వృషభం (Taurus): ఈ రాశిచక్రం యొక్క సంచార జాతకంలో గురుడు పదకొండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీ విజయానికి దారులు తెరుచుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ఈ సమయంలో ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Dhanteras 2022: ధంతేరాస్ రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే... ఏడాది మెుత్తం మీకు డబ్బే డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook