Margi Guru effect on Zodiac Sign: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం తన రాశిచక్రాన్ని నిర్ణీత సమయంలో మారుస్తుంది. ఇది అన్ని రాశిచక్ర గుర్తులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతి గ్రహాన్ని అదృష్టం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలంగా ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో అదృష్టాన్ని పొందుతాడు. బృహస్పతి సంవత్సరానికొకసారి తన రాశిని మారుస్తాడు. 12 సంవత్సరాల తర్వాత గురువు తన సొంత రాశి అయిన మీనరాశిలో ఉన్నాడు. ప్రస్తుతం బృహస్పతి మీనంలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 24 వరకు అతడు అదే స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత మార్గంలోకి వస్తాడు. గురుడి యెుక్క ఈ ప్రత్యక్ష కదలిక వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. దీంతో వారు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం(Taurus): మార్గి గురువు కారణంగా ఈరాశివారి ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు పెద్ద ప్యాకేజీతో జాబ్ సాధిస్తారు. వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారుల పెద్ద పెద్ద ఒప్పందాలను ఖరారు చేసుకుంటారు. బిజినెస్ లో భారీగా లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఇల్లు-కారు కొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి మీరు ఉపశమనం పొందుతారు. 
మిథునరాశి (Gemini): బృహస్పతి ప్రత్యక్ష సంచారం వల్ల మిథునరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు.  ఉద్యోగ-వ్యాపారాలలో విజయం సాధిస్తారు. జీతం పెరుగుతుంది. బిజినెస్ విస్తరిస్తుంది. కొత్త జాబ్ ను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.  మొత్తం మీద ఈ టైంలో మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. భవిష్యత్తులో ప్రయోజనాలను అందించే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి బృహస్పతి మార్గం చాలా లాభాన్ని ఇస్తుంది. రాజయోగం వల్ల వీరు ప్రతి పనిలోనూ విజయవంతమవుతారు. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవం పొందుతారు. మీరు పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.


Also Read: Guru Vakri 2022: తిరోగమనంలో బృహస్పతి.. ఇక ఈ 4 రాశులకు తిరుగుండదు మరి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి