Guru Purnima 2022 Date Puja Muhurat, Importance: గురు పూర్ణిమ ఈ సంవత్సరం 13 జూలై 2022, బుధవారం జరుపుకుంటారు. ఇది ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. వేదాలు, బ్రహ్మసూత్రాలు రచించిన వ్యాస మహర్షి గౌరవ సూచకంగా ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. వేద వ్యాసుడిని మెుదటి గురువుగా పరగణించి ఆరాధిస్తారు. వ్యాసుడిని విష్ణువు యెుక్క అవతారంగా భావిస్తారు. అందుకే గురు పూర్ణిమ (Guru Purnima 2022) రోజున విష్ణువును కూడా పూజిస్తారు. అంతే కాకుండా ఈ రోజున ప్రజలు తమ గురువులను పూజిస్తారు మరియు గౌరవిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు పూర్ణిమ 2022 నాడు 4 రాజయోగాలు
గురు పూర్ణిమకు జ్యోతిషశాస్త్రపరంగా ఎంత ప్రాధాన్యత ఉందో అంతే మతపరమైన ప్రాధాన్యత కూడా ఉంది. ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే ఈసారి గురు పూర్ణిమ మరింత ప్రత్యేకత సంతరించుకుంది. గురు పూర్ణిమ 2022 రోజున కుజుడు, బుధుడు, బృహస్పతి మరియు శని గ్రహాలు చాలా శుభ స్థానంలో ఉంటాయి. దీని వల్ల గురు పూర్ణిమ నాడు రుచక్, భద్ర, హన్స్, షష్ అనే 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. మొత్తంమీద, గురు పూర్ణిమ రోజున చేసే పూజలు శుభపలితాలను ఇస్తాయి. 


శుభ సమయం, పూజా విధానం
>> హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసం యొక్క పౌర్ణమి తేదీ జూలై 13 ఉదయం 04:00 నుండి ప్రారంభమై...  జూలై 13 రాత్రి 12:06 వరకు ఉంటుంది. ఈ విధంగా ఈ రోజంతా గురువును పూజించడానికి, జ్యోతిష్య చర్యలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం అవుతుంది.
>> గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటి పూజా మందిరంలోని దేవతలను పూజించండి. విష్ణువు మరియు వేదవ్యాసుడిని పూజించండి. అనంతరం మీ గురువు గారికి తిలకం పెట్టి మాల వేసి ఆశీర్వాదాలు తీసుకోండి. మీకు ఉన్నంత మేరకు వారికి బహుమతులు ఇచ్చి గౌరవించండి. 


Also Read: 21 June 2022 Special: జూన్ 21కు చరిత్రలో ఎందుకు అంత ప్రత్యేకత? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.