Guru Chandal Yoga 2023: అంతరిక్షంలో గ్రహాల గ్రమనంలో మార్పు మనందరిపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల అధిపతి అయిన బృహస్పతి 23 ఏప్రిల్ 2023న మేషరాశిలో సంచరించనున్నాడు. ఛాయా గ్రహంగా భావించే రాహువు ఇప్పటికే మేషరాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబరు 30 వరకు రాహువు మేషరాశిలోనే ఉంటాడు. ఈ రెండు గ్రహాలు ఆరు నెలలపాటు అదే రాశిలో  కలిసి ఉంటాయి. ఈ రెండింటి కలయిక వల్ల గురు-చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఎవరి జాతకంలో ఏర్పడుతుందో వారికి రాబోయే కాలం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ముఖ్యంగా 6 నెలలుపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో గురు-చండాల యోగం ఏర్పడుతుందో వారి జీవితంలో ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయి. ఈ యోగం ఉన్నవారు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు. తప్పు, ఒప్పుల మధ్య భేదాన్ని గుర్తించలేరు. వీరు తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. అంతేకాకుండా వీరు తమ పనిని పూర్తిచేయడానికి హింస చేయడానికైనా వెనుకాడరు. ఎవరి జాతకంలో గురు-చండాల యోగం ఏర్పడుతుందో వారు గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించాలి. అరటిపండును పూజించడం వల్ల ఈ యోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి. గురు-చండాల దోష నివారణ పూజ చేయండి. 


Also Read: Trigrahi Yog: కుంభరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook