Grah Gochar: 2023లో 4 ప్రధాన గ్రహాల గమనంలో పెను మార్పు.. ఏ రాశులకు లాభమో తెలుసుకోండి..
Grah Gochar 2023: నూతన సంవత్సరంలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. వీటి రాశి మార్పు కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది.
Grah Gochar 2023: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2023 రాబోతుంది. ఈ ఏడాదిలో చాలా గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. ప్రధాన గ్రహాలైన బృహస్పతి, శనితోపాటు రాహు-కేతు గమనంలో పెను మార్పు రానుంది. శని గ్రహం రెండున్నర సంవత్సరాలకు, బృహస్పతి 12 నెలలకు, రాహు-కేతువులు 18 నెలల తర్వాత తమ రాశులను మార్చనున్నాయి. జనవరి 17న శనిగ్రహం కుంభరాశిలోకి, ఏప్రిల్‌లో బృహస్పతి మేషరాశిలోకి, అక్టోబర్‌లో రాహువు మీనరాశిలోకి, అదే నెల 30న కేతువు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు.
గురు గోచారం ఎవరికి లాభం?
మేషం, తుల, కర్కాటకం, కన్య మరియు మీనం రాశులకు గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మేష రాశికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తుల రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారులు భారీగా లాభపడతారు. కర్కాటక రాశికి అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కన్యా రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీన రాశివారు శుభవార్తలు వింటారు. ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు.
శని సంచారం ఎవరికి ప్రయోజనం?
వృషభం, మిథునం, తుల మరియు ధనుస్సు రాశుల వారికి శని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమస్యల నుండి బయటపడతారు. మిథున రాశివారిపై సడేసతి ముగుస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. తులరాశివారికి ప్రమోషన్, గౌరవం లభిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయ. ధనస్సు రాశివారికి ధనలాభం కలుగుతుంది.
రాహు సంచారం ఎవరికి మేలు?
వృషభ, తుల, మకర రాశులకు రాహు సంచారం లాభిస్తుంది. వృషభ రాశి వారు స్నేహితులు మరియు సోదరుల నుండి సహాయం పొందుతారు. స్టాక్ మార్కెట్‌తో అనుబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి. రాహు సంచారం తుల రాశి వారికి విపరీతమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. విదేశాలకు వెళ్లాలనే కల కూడా నెరవేరుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మకర రాశి వ్యాపారులు లాభపడతారు. పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కేతు సంచారం మీకు అదృష్టానిస్తుంది...
వృషభం, సింహం, ధనుస్సు, మకర రాశుల వారు కేతువు సంచారం వల్ల ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడికి ఇదే మంచి సమయం. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో లాభం ఉంటుంది. సింహ రాశి వారి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. కష్టపడి పని చేస్తే వ్యాపారంలో విజయం లభిస్తుంది. పెట్టుబడికి మంచి సమయం. ఆఫీసులో సహోద్యోగుల సహకారం ఉంటుంది. ధనుస్సు రాశి వారు పాత రోగాల నుండి బయటపడతారు. మకర రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
Also Read: Bhogi Festival: 2023లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ ఫెస్టివల్ ప్రాముఖ్యత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.