Guru-Shukra Yuti 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర, గురు గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం వల్ల శుభ పరిణామాలు ఏర్పడుతాయి. అంతేకాకుండా తిరోగమనం చేయడం వల్ల కూడా అన్ని రాశులవారికి మేలు జరుగుతుంది. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో శుక్రుడు, గురు గ్రహాల కలయిక వృషభ రాశిలో జరబోతోంది. ఈ కలయిక దాదాపు 50 ఏళ్ల తర్వాత జరగబోతోంది. కాబట్టి కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి:
శుక్రుడు, గురు గ్రహాల కలయికతో వృషభ రాశివారి జీవితంలో కీలక మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కాబట్టి డబ్బును ఆదా చేసుకోవడం వల్ల భవిష్యత్‌లో వృద్ధి సాధిస్తారు. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు జీవితంలో ఇక ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం చాలా వరకు కలసివస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ సమయంలో ప్రతి పనిలో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందం పెరుగుతుంది.


తులారాశి:
ఈ గ్రహాల కలయిక కారణంగా తులారాశివారికి అదృష్టం అనుకూలిస్తుంది. అంతేకాకుండా ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో పాటు ఎక్కడ పెట్టుబడులు పెట్టిన విపరీతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా ప్రరిష్కారమవుతాయి. అంతేకాకుండా స్నేహితులతో కలిసి వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు. దీని కారణంగా సంబంధాలు మరింత మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే అద్భుతమైన విజయాలు సాధించేందుకు ఇది సరైన సమయంగా భావించవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు కూడా లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు తొందరలోనే ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన సలభంగా ఆదాయం పెంచుకోగలుగుతారు. అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు నుంచి కూడా కొంత విముక్తి లభిస్తుంది. అలాగే ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల సులభంగా విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. అలాగే కుటుంబ సభ్యుల సపోర్ట్‌ లభించి విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి