Guru Graha Sancharam 2024: 1 సంవత్సరం తర్వాత గురు గ్రహం వృషభ రాశిలోకి.. వీరి సమస్యలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయి!
Guru Graha Sancharam 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే మొదటి వారంలో గురుగ్రహం రాశి సంచారం చేయబోతోంది ఈ గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలనుంచి కూడా పరిష్కారం లభిస్తుంది.
Guru Graha Sancharam 2024 To 2025 In Telugu: గురు గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంచారం మే మొదటి వారంలో జరగబోతోంది ప్రస్తుతం ఈ గ్రహం మేషరాశిలో సంచార క్రమంలో ఉంది అయితే మే మొదటి వారంలో వృషభ రాశిలోకి గురు గ్రహం సంచారం చేయబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహం జాతకంలో అనుకూల స్థానంలో ఉంటే ఎలాంటి పనులు చేసిన అదృష్టం కలిసి వస్తుంది. అయితే గురు గ్రహం దాదాపు సంవత్సరం తర్వాత రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం వృషభ రాశిలోకి సంసారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలతో పాటు అదృష్టం కూడా పెరుగుతుంది. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారిపై గురు గ్రహ ప్రభావం:
సింహరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం కారణంగా సింహ రాశి వారికి ఎంతో శుభ్రంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు విదేశాల్లో వాటిని విస్తరించే అవకాశాలున్నాయి అలాగే కొన్ని విదేశీ ఒప్పందాలు కూడా జరుపుకుంటారు అలాగే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న గొడవలు కూడా పరిష్కారమవుతాయి దీంతో పాటు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
కన్యా రాశి:
గురు గ్రహ సంచారం కారణంగా కన్యా రాశి వారికి కూడా అదృష్టం పెరుగుతుంది ఈ సమయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోతున్న పనులు ఈ సమయంలో సులభంగా జరుగుతాయి. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి కోరిక కూడా నెరవేరబోతోంది. అలాగే కన్యా రాశి వారు పిల్లలనుంచి కూడా శుభవార్తలు వింటారు. దీంతోపాటు వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారం కూడా లభిస్తుంది.
వృషభం:
గురు గ్రహ సంచార ప్రభావం వృషభ రాశి వారిపై కూడా ప్రత్యక్షంగా పడబోతోంది దీనికి కారణంగా వీరి జీవితంలో కీలక మార్పులు జరుగుతాయి మే మొదటి వారం నుంచి వీరికి అదృష్టం పెరుగుతుంది అలాగే ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభించి ఖర్చులు తగ్గుతాయి దీంతోపాటు వీరు డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించడం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా కొనసాగుతుంది ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఇది ఎంతో మధురమైన సమయంగా చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter