Guru Uday 2023: మరికొన్ని గంటల్లో వీరి జాతకం మారిపోనుంది.. ఇందులో మీరున్నారా?
Jupiter rise 2023: రేపు మేషరాశిలో బృహస్పతి ఉదయించబోతున్నాడు. దీని వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనాలు పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Guru Uday Effect 2023: గ్రహాల కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. పంచాంగం ప్రకారం, రేపు అంటే ఏప్రిల్ 27, గురువారం నాడు తెల్లవారుజామున 02:07 గంటలకు దేవగురు బృహస్పతి మేషరాశిలో ఉదయించబోతున్నాడు. గురుడు రైజింగ్ వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి
ఇదే రాశిలో బృహస్పతి ఉదయించబోతున్నాడు. దీని వల్ల మేషరాశి వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆఫీసులో మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు పని నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీకు ఈ సమయం కలిసి వస్తుంది.
మిధునరాశి
బృహస్పతి యొక్క పెరుగుదల మిథునరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు.
Also Read: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ 2 రాశులకు మంచిది కాదు.. ఇందులో మీరున్నారా?
కర్కాటక రాశి
మేషరాశిలో గురుడు ఉదయం మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు రాశి
బృహస్పతి ఉదయం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీకు ప్రమోషన్ లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
Also Read: Mangal Gochar 2023: మే 10న కీలక పరిణామం.. ఈ 6 రాశులపై 45రోజులపాటు డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook