హిందూమతంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకూ పూజాది కార్యక్రమాల వివరాలున్నాయి. వీటితోపాటు కొన్ని విషయాలు శుభసూచకమని..మరి కొన్ని అశుభమని జ్యోతిష్యం వివరిస్తోంది. ముఖ్యంగా హెయిర్ కట్ గురించి. హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకోవాలనే వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతపు జ్యోతిష్యం ప్రకారం ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదనే వివరాలు కూలంకషంగా ఉన్నాయి. జీవితాన్ని ఎలా గడపాలనే అంశాలు కూడా ఉంటాయి. చాలామంది ఆదివారం నాడే హెయిర్ కట్ చేయించుకుంటుంటారు. కానీ హిందూమతం ప్రకారం ఆదివారం హెయిర్ కట్ చేయించుకోవడం మంచిదా కాదా, ఏరోజు చేయించుకోవాలనే వివరాలు పరిశీలిద్దాం..


మహాభారతంలోని అనుశాసనం పర్వంలో దీని గురించి ప్రస్తావన ఉంది. వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో హెయిర్ కట్ అనేది అశుభమని ఇందులో ఉంది. చాలామంది ఇదొక మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తుంటారు. కానీ దీని వెనుక లాజిక్ ఏముందనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతికూల ప్రభావం పడినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. వయస్సుపై కూడా ప్రభావం పడుతుంది. హెయిర్ కట్ లేదా షేవింగ్ వారంలో ఎప్పుడు చేయించుకుంటే శుభసూచకం, ఎప్పుడు అశుభమో ఇలా ఉంది. 


ఆదివారం


ఆదివారం అంటే సూర్య భగవానుడికి అంకితమైన రోజు. ఈ రోజు హెయిర్ కట్ చేయించడం వల్ల మతం, బుద్ధి, ధనం అన్నీ నాశనమౌతాయి.


సోమవారం  


సోమవారం అనేది మహాదేవుడికి అర్పితమైన రోజు. ఈ రోజున హెయిర్ కట్ చేయించడం వల్ల శివభక్తికి హాని కలుగుతుంది. ఏ విధమైన కేశాల కట్ మంచిది కాదు.


మంగళవారం


మంగళవారం నాడు హెయిర్ కట్ చేయించడం అశుభంగా భావిస్తారు. దీనివల్ల ప్రేమ తగ్గుతుంది. 


బుధవారం


ఒకవేళ మీకు అదృష్టం కలిసి రావాలనుకుంటే..అభివృద్ది సాధించాలంటే బుధవారం నాడు హెయిర్ కట్ లేదా నెయిల్ కటింగ్ మంచిది. దీనివల్ల ధనలాభం కూడా కలుగుతుంది.


గురువారం


ఈ రోజు క్షవరం చేయించుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అంతేకాకుండా గౌరవ మర్యాదలు కూడా క్షీణిస్తాయి.


శుక్రవారం


శుక్రవారం నాడు హెయిర్, నెయిల్ కటింగ్ అత్యంత శుభసూచకం. దీనివల్ల కీర్తి, లాభం కలుగుతుంది. 


శనివారం


ఈ రోజు హెయిర్ కట్ చేయించడం వల్ల దుఖం కలుగుతుంది. అందుకే శనివారం నాడు హెయిర్ కట్ లేదా నెయిల్ కటింగ్ మంచిది కాదు. 


Also read: Vish Yoga 2023: శని, చంద్రుల కలయిక వల్ల అశుభ యోగం... వీరి జీవితం సమస్యలమయం..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook