Hanuman Jayanthi 2021 Date, Significance: తిరుమలలో నేటి నుంచి 5 రోజులపాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు
Hanuman Jayanthi 2021 Date, Significance: గత కొన్ని రోజుల నుంచి హనుమంతుడి జన్మస్థలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడు జన్మించాడని, హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.
Hanuman Jayanthi 2021 Date, Significance: హిందువుల పండుగలలో హనుమాన్ జయంతి ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. గత కొన్ని రోజుల నుంచి హనుమంతుడి జన్మస్థలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడు జన్మించాడని, హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. సూర్యుడిని మింగడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్న మారుతి అపూర్వ దివ్యశక్తులతో జీవం పొందారు. ఆ సమయంలోనూ మరోసారి హనుమాన్ జయంతిని కొందరు నిర్వహిస్తారు.
తిరుమలలో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. హనుమంతుడిని భక్తితో కొలిస్తే శ్రీరాముడు సైతం మన బాధలు, సమస్యలు తీరుస్తాడని పెద్దలు విశ్వసిస్తారు. అయితే తిరుమలలోని అంజనాద్రినే మారుతి జన్మస్థలమని ప్రకటన తరువాత నిర్వహిస్తున్న తొలి హనుమాన్ జయంతి కనుక టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 04 జూన్ 2021, ఓ రాశివారికి ఉద్యోగావకాశాలు
హనుమంతుడికి 5 నెంబర్ అంటే ఇష్టమని, మనం ఆయనకు ప్రదక్షిణలు చేయాలని పెద్దలు చెబుతుంటారు. రామనామం జపించినా హనుమ మీపై దయ చూపుతాడు. నేటి నుంచి మంగళవారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తారు. ఒక్కోరోజు ప్రత్యేకమైన పుష్పాలతో హనుమకు అభిషేకం, అర్చన, ఇతర ప్రత్యేక పూజలు టీటీడీ నిర్వహించనుంది. కోవిడ్19 నిబంధనలతో భక్తులను ఈ కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook