Hanuman Jayanthi: నవ గ్రహాల్లో రాహువు, కుజుడు, శుక్రుడు, మరియుడు బుధ గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తుంటారు జ్యోతిష్కులు.  అయితే చైత్ర శుద్ద పౌర్ణిమి రోజున మీనరాశిలో 4 గ్రహాల కలయికతో అరుదైన చాతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఏప్రిల్ 23న కుజుడి ప్రవేశంతో అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. శుక్రుడు, కుజుడు, బుధుడు, రాహువుల కలయికతో ఏర్పడిన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. హనుమాన్ జయంతి రోజున 4 పెద్ద గ్రహాల అరుదైన కలయిక వల్ల ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం కలగబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి..
మిథున రాశి విషయానికొస్తే.. మీనంలో అరుదైన చతుర్గ్రాహి యోగం వల్ల ఈ రాశి వారికీ అనుకోని ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా కుజుడు, శుక్రుడు, రాహువు, బుధ గ్రహాల కలయిక వల్ల ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కలలు నెరవేరే అవకాశం ఉంది. ఆర్ధికంగా బలంగా ఉండాలంటే పెట్టుబడితో పాటు పొదుపుపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం.


కర్కాటక రాశి..
కర్కాటక రాశి విషయానికొస్తే.. కుజుడు, శుక్రుడు, రాహువు, మరియు బుధ గ్రహాల సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీరలో మీ యజమాని మన్ననలు అందుకుంటారు. అనేక కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికీ ఇదే సరైన సమయం. ఏ నిర్ణయం తీసుకున్న ఆచితూచి తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తత అవసరం.


వృషభ రాశి..
వృషభం వారికీ శుక్ర, కుజ, రాహు, బుధ గ్రహాల సంచారం వల్ల ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది. వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్ధిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఎంతో ఆలోచించి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టొద్దు.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: Rahul Gandhi Unwell: ఎండలకు తాళలేక రాహుల్‌ గాంధీ తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కాంగ్రెస్‌ శ్రేణులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter