Sankranti 2024 Wishes: తెలుగు ప్రజల లోగిళ్లలో రేపు ఉదయం నుంచి భోగి మంటలు కన్పిస్తాయి. ఎల్లుండి భోగి, జనవరి 14న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలతో మూడ్రోజులు తెలుగు లోగిళ్లన్నీ అత్యంత సందడిగా కళకళలాడుతుంటాయి. హరిదాసు కీర్తనలు, రంగవల్లులు, కోడి పందేలతో సందడి వాతావరణం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి ఈ పెద్ద పండుగకు మీరు మీ స్నేహితులు, హితులు, బంధువులకు ఎలా విష్ చేస్తారు..వాట్సప్ సందేశాలు, వాట్సప్ స్టేటస్, ఎస్ఎంఎస్ ద్వారా విషెస్ చెప్పేందుకు మీ కోసం కొన్ని కోట్స్ ఇక్కడ అందిస్తున్నాం..ఎప్పుడూ చెప్పే విధంగా కాకుండా సరికొత్తగా చెప్పేందుకు మీకు ఉపయోగపడవచ్చు. ఈ కోట్స్‌ని మీ వాట్సప్ స్టేటస్‌గా కూడా పెట్టుకోవచ్చు.


1. భోగి మంటలతో రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలుకుతూ..మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు


2. తెల్లవారుజాము ప్రతి వాకిట్లో సంబరాల కాంతి తీసుకురావాలని..జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


3. ఈ భోగి మంటలు మీ జీవితంలో చీకట్లు పారద్రోలాలి..మీ ఇంట భోగభాగ్యాలు రావాలి..మీ జీవితం అత్యంత ఆనందంగా సాగాలి..అందరికీ భోగి శుభాకాంక్షలు


4. ఆరుగాలం కష్టించిన పాడి పండలు చేతికొచ్చిన వేళ, కమ్మనైన పిండి వంటలు..చలిని పారద్రోలే భోగి మంటలు,,ప్రతి ఇంటా కొత్త కాంతి వెదజల్లాలి..అందరికీ శుభాకాంక్షలు


5. ఈ భోగి మంటలతో మీ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోవాలి. కొత్త ఆనందం, కొత్త ఆలోచన, కొత్త మార్గాలకు వెలుతురు కావాలి. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు


6. మకర సంక్రాంతి మీ ఇంట కొత్త కాంతులు వెదజల్లాలి, ఈ భోగి మీ జీవితంలో కొత్త భోగభాగ్యాలు తీసుకురావాలి, ఈ కనుమ అందర్నీ ఒక్కటిగా కలపాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


7. భోగి మంటలు జీవితంలో కొత్త ఆనందం, కొత్త వెలుతురు తీసుకురావాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు


8. ఈ భోగి మంటలు ఆనందాల వెలుగులు నింపాలి, ఈ సంక్రాంతి కొత్త క్రాంతికి బీజం వేయాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


9. మీ బాధలు, మీ కష్టాలు, మీ దుఖం అంతా భోగమంటల్లో కాల్చేయండి..ఆ వెలుతురులో కొత్త ఆనందం, కొత్త మార్గం అణ్వేషించండి సంక్రాంతి శుభాకాంక్షలు


10. భోగి మంటల్లో మీ చెడు అలవాట్లు, చెడు సావాసాలను పడేయండి, మీ జీవితంలో కొత్త వెలుగుకు ఆహ్వానం పలకండి. కుటుంబ సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలు


Also read: Vangaveeti Radha: వంగవీటి రాధా వైసీపీలో చేరడం ఖాయమేనా, పోటీ ఎక్కడ్నించి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook