Wishes for Bakrid: ఈదుల్ అదా ప్రాముఖ్యత ఏంటి.. బక్రీద్‌కు ఎలాంటి విషెస్ చెప్పాలి..?
Wishes for Bakrid and Quotes: ఇస్లామిక్ కేలండర్‌లో అత్యంత ముఖ్యమైంది ఈద్ అల్ అదా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వేడుక ఇది. హజ్ యాత్రకు ముగింపు ఈ పండుగ. ప్రపంచవ్యాప్తంగా భక్తులు మక్కా యాత్రకు తరలివచ్చే సందర్భమిది.
Wishes for Bakrid and Quotes: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం మక్కా. ఇస్లామిక్ కేలండర్‌లో జిల్‌హజ్ నెలలోని పదవ రోజున బక్రీద్ జరుపుకుంటారు. ఇస్లాంలోని ఐదు పిల్లర్లలో హజ్ యాత్ర కీలకమైంది.
అబ్రహం, ఇస్మాయిల్ ప్రవక్తలు అనుసరించిన సంప్రదాయాల్లో హజ్ యాత్ర ఒకటి. హజ్ యాత్రికులు హజ్ యాత్ర సందర్భంగా చాలా సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా సఫా మరియు మర్వా చుట్టూ 7 సార్లు తిరగడం వంటివి ఉంటాయి. ఇవాళ జూన్ 28న సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ముగింపుతో పాటు బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. ఇండియా తదితర దేశాల్లో రేపు అంటే జూన్ 29వ తేదీన ఈదుల్ అదా ఉంటుంది.
బక్రీద్ పండుగను జిల్ హజ్ పదవరోజు జరుపుకుంటారు. బక్రీద్ పండుగ అంటే త్యాగ నిరతికి చిహ్నం. అల్లాహ్ ఆదేశాల మేరకు కన్న కొడుకునే బలిచ్చేందుకు సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త త్యాగనిరతికి గుర్తింపుగా బక్రీద్ పండుగ జరుపుకుంటారు.
ఈద్ ముబారక్, హ్యాపీ ఈదుల్ అదా, హజ్ ముబారక్, హ్యావ్ ఎ సేఫ్ అండ్ పీస్‌పుల్ ఈద్, ఎంజాయ్ యువర్ ఈద్ ఫీస్ట్, విషింగ్ యు హెల్త్ అండ్ హ్యాపినెస్ ఆన్ ఈద్ , మే దిస్ ఈదుల్ అదా బ్రింగ్స్ యు హోప్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ-ఈద్ ముబారక్, విషింగ్ యు ఎ జాయస్ ఈద్, మే యువర్ ఈద్ బి ఫిల్డ్ విత్ లవ్, విషింగ్ యు జాయస్ ఈద్, మే ది శాక్రిఫైస్ ఆఫ్ ఈదుల్ అదా రిమైండ్ యు ఆఫ్ గాడ్స్ మెర్సీ, హ్యావ్ ఎ జాయస్ డే ఆఫ్ ఈటింగ్ అండ్ సెలెబ్రేషన్.
Also Read: Venus Transit 2023: సింహరాశి ప్రవేశం చేయనున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు లాభాలు షురూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి