Happy Ramadan Mubarak 2023 wishes: మీ బంధుమిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి
Happy Ramadan Mubarak 2023 wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ వచ్చేసింది. రేపట్నించి దాదాపుగా ఉవపాసాలు ప్రారంభం కానున్నాయి. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకునే సమయం ఆసన్నమైంది. మీ స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు ఎలా చెప్పాలో మీ కోసం కొన్ని అందిస్తున్నాం.
Happy Ramadan Mubarak 2023 wishes: పండుగ ఏదైనా సరే బంధు మిత్రులు, కుటుంబసభ్యులు, కొలీగ్స్ అందరికీ వాట్సప్ ద్వారా, ఫోన్ ద్వారా, వాట్సప్ స్టేటస్ ద్వారా, జీఐఎఫ్ ఇమేజ్ ద్వారా, మెస్సేజిల ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇప్పుడు రంజాన్ విషెస్ చెప్పుకుంటున్నారు. మీరు కూడా ఎలా విష్ చేయాలో కొన్ని మీ కోసం ఉదహరిస్తున్నాం.
పవిత్ర ఖురాన్ రంజాన్ నెలలో అవతరించినందున ఈ నెలకు అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ 9వ నెల. షాబాన్ నెల 29వ రోజు చంద్ర దర్శనమైతే ఆ తరువాతి రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమౌతాయి. ఒకవేళ చంద్ర దర్శనం కాకుంటే షాబాన్ 30 రోజులు పూర్తి చేసుకుని ఆ తరువాత రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభించుకోవాలి. ఉపవాసాలు, నమాజ్ ద్వారా అల్లాహ్ ఆరాధనలో గడుపుతారు. సౌదీ దేశాల్లో రంజాన్ రేపట్నించి ప్రారంభం కానుండగా, ఇండియా పొరుగు దేశాల్లో రేపు లేదా ఎల్లుండి నుంచి మొదలు కావచ్చు.
మీ కోసం రంజాన్ విషెస్, మెస్సేజెస్, క్వొటేషన్స్
1. మీ ఉపవాసాలు, నమాజ్ ద్వారా అల్లాహ్ మీకు శాంతిని, ఆనందాన్ని కలుగజేయుగాక, ఎంజాయ్ పీస్‌ఫుల్ హ్యాపీ రంజాన్
2. మీ జీవితం ఎంత కష్టంగా ఉన్నా సరే..రంజాన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. రంజాన్ ముబారక్
3. మనం మన జీవితాల్లో కోరుకునే మంచి మార్పును ఈ రంజాన్ తెస్తుందని ఆశిస్తూ హ్యాపీ రంజాన్ ముబారక్
4. మరో రంజాన్ పొందడమంటే మరోసారి క్షమాపణలు కోరుకునే మహత్తర అవకాశం లబించినట్టే. హ్యాపీ రంజాన్
5. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అల్లాహ్ మనపై దయ చూపించి అందరి పాపాల్ని క్షమిస్తూ రుజుమార్గం చూపించాలని కోరుకుంటూ..
6. మీ విశ్వాసాలకు అనుగుణంగా ఇస్లాం బోధనలు పాటించండి. రంజాన్ పూర్తయ్యాక జన్నత్ వైపు మీ ప్రయాణం కొనసాగించాలి. రంజాన్ ముబారక్
7. మీకు మీ కుటుంబానికి రంజాన్ ముబారక్, ఈ పవిత్ర నెల మీ మనస్సుని, శరీరాన్ని పవిత్రంగా ఉంచుగాక
8. రంజాన్ చంద్రుడు అల్లాహ్ దయతో కూడిన సందేశాల్ని అందించుగాక, హ్యాపీ రంజాన్
9. మీకు మీ కుుటుంబానికి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అల్లాహ్ దయ మీపై మనందరిపై సదా ఉండుగాక
10. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. రంజాన్ నెలలో మీ విధేయత, మీ నిజాయితీ, మీ చిత్తశుద్ది రెట్టింపు లాభాల్ని ఇస్తుంది.
11. ఈ పవిత్ర రంజాన్ నెల మీ పాపాల్ని క్షమించి మీ మనస్సును పవిత్రం చేసి మీపై దయ కురిపించుగాక, హ్యాపీ రంజాన్
Here's wishing everyone, Ramadan Mubarak!
Also read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాలు ఎప్పట్నించి, సహరి, దేశంలోని వివిధ నగరాల్లో సహరి, ఇఫ్తార్ వేళలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook