Sravana Amavasya 2022: హరియాళీ అమావాస్య పండుగను శ్రావణ మాసం అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది హర్యాలీ అమావాస్య (Hariyali Amavasya 2022) 28 జూలై 2022న వస్తుంది. ఈ రోజున స్నానానికి, దానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య రోజున మెుక్కలు నాటడం శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు, ఈ హరియాళీ అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక చెట్లను పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి.. అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హరియాళీ అమావాస్య నాడు చెట్లను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడాబాధ్యత తీసుకోండి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరియాళీ అమావాస్య 2022 తేదీ
ప్రారంభం - 27 జూలై 2022, బుధవారం 09:11
ముగింపు- గురువారం 28 జూలై 2022, రాత్రి 11:24 వరకు


అమావాస్య రోజున ఈ చెట్లను పూజించండి
వేప చెట్టు: సంతానం కలగాలంటే ఈ రోజు వేపచెట్టును పూజించండి. అంతేకాకుండా ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది.  హరియాళీ అమావాస్య నాడు ఈ మెుక్కను నాటడం వలన పితృదోషం పోతుంది. 
రావిచెట్టు: హిందూమతంలో రావిచెట్టును ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులు ఈ చెట్టులో నివశిస్తారని నమ్ముతారు. హరియాళీ అమావాస్య నాడు ఈ చెట్టును పూజించడం వల్ల శని మహాదశ తొలగిపోతుంది. 
మర్రిచెట్టు: హరియాళీ అమావాస్యనాడు దీనిని పూజిస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.  
జామ చెట్టు: డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడాలంటే...హరియాళీ అమావాస్య నాడు జామ చెట్టును పూజించండి. సాయంత్రం పూట చెట్టుకింద నెయ్యి దీపం పెట్టండి.
మారేడు మెుక్క (బిల్వ వృక్షం): శ్రావణంలో బిల్వ వృక్షాన్ని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఈ రోజున బిల్వ పత్రాలను ఎప్పుడూ చింపకండి. లేకపోతే శివుడికి కోపం వస్తుంది. 


Also Read: Mars Transit Effect 2022: వృషభరాశిలో కుజుడు సంచారం... ఈ 5 రాశులవారికి బంపర్ ప్రయోజనాలు!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook