Hariyali Amavasya 2022: శ్రావణ మాసం వచ్చే అమావాస్యనే శ్రావణ అమావాస్య లేదా హరియాళీ అమావాస్య (Hariyali Amavasya 2022) అని అంటారు. ఈరోజున శివారాధన చేస్తారు. ఈ మాసంలో వచ్చే హరియాళీ తీజ్ కు మూడు రోజుల ముందు మహిళలు ఈ హరియాళీ అమావాస్యను జరుపుకుంటారు. తమ భర్తకు దీర్ఘాయువు ప్రసాదించమని ఈ రోజున పార్వతీపరమేశ్వరులను మరియు రావిచెట్టును పూజిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరియాళీ అమావాస్య ఎప్పుడు?
ఈ ఏడాది హరియాళీ అమావాస్య తిథి జూలై 27, 2022 బుధవారం రాత్రి 9.11 గంటలకు ప్రారంభమై జూలై 28, గురువారం రాత్రి 11.24 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి సందర్భంగా జూలై 28న హరియాళీ అమావాస్య జరుపుకుంటారు. 


హరియాళీ అమావాస్య పూజా విధానం
>> హరియాళీ అమావాస్య రోజున శివుని ఆరాధనతో పాటు పార్వతీ దేవి, తులసి మరియు రావి చెట్టును పూజిస్తారు. పూర్వీకులకు ఈ రోజున పూజలు చేయడం వల్ల వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి.  
>> ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాసం పాటిస్తూ..శివపార్వతులను పూజించాలి. ఈ రోజు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రోజు అవసరమైన వారికి దానం  చేయండి. హరియాళీ అమావాస్య రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది.  
>> హరియాళీ అమావాస్య రోజున మొక్కలు నాటుతారు. ముఖ్యంగా తులసి, బిల్వపత్ర, ఉసిరి, అరటి వంటి పవిత్రమైన మెుక్కలను నాటుతారు. ఇలా చేయండ వల్ల అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. 


Also Read: Sravana vinayaka chaturthi 2022: శ్రావణ వినాయక చతుర్థి నాడు గణేశుడిని ఇలా పూజించండి! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook