Hariyali Amavasya 2022: హరియాళీ అమావాస్య తేదీ, ప్రాముఖ్యత, పూజా విధానం
Hariyali Amavasya 2022: శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను హరియాళీ అమావాస్య అంటారు. ఈ రోజున చెట్లు, మొక్కలు నాటడం ప్రత్యేకం.
Hariyali Amavasya 2022 : శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను హరియాళీ అమావాస్య అంటారు. అమావాస్యను ప్రతి నెల కృష్ణ పక్షం చివరి రోజున జరుపుకుంటారు. ఈసారి హరియాళీ అమావాస్య (Hariyali Amavasya 2022) జూలై 28 గురువారం నాడు వస్తోంది. ఈ రోజున స్నాన-దానం, పూజ-పారాయణం, ఉపవాసం, పితృ తర్పణం చేయడం మంచిదని భావిస్తారు. ఈ రోజున చెట్లను నాటడం పవిత్రంగా భావిస్తారు. అదేవిధంగా అమావాస్య నాడు శివుడిని పూజిస్తారు. ఈ హరియాళీ అమావాస్యకే హర్తాళికా అమావాస్య, హరియాలీ తీజ్ వంటి పేర్లు ఉన్నాయి. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
శుభ సమయం 2022
ప్రారంభం: జూలై 27, బుధవారం రాత్రి 9.11 గంటల నుండి
ముగింపు: జూలై 28, గురువారం రాత్రి 11.24 గంటలకు
ప్రాముఖ్యత
ఈ రోజున మతపరమైన మొక్కలను నాటడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రావి, మర్రి, అరటి, నిమ్మ, తులసి మరియు ఉసిరి వంటి చెట్లు మరియు మొక్కలను ఈ రోజున నాటుతారు. ఈ మొక్కల్ని నాటడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు, పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆశ్వీరాదాలు లభిస్తాయి.
పూజా విధానం
హరియాళీ అమావాస్య నాడు శివపార్వతులను పూజిస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే లేచి పవిత్ర నదిలో స్నానం చేస్తారు. వీలుకాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం వేసి స్నానం చేయండి. అనంతరం శుభ్రమైన బట్టలు ధరించి శివుడిని మరియు పార్వతిని పూజించండి. పార్వతీ దేవికి ఉంగరాన్ని తయారు చేసి, పంచామృతంతో శివలింగాన్ని అభిషేకించండి. తర్వాత బిల్వ పత్రాలు, డాతురా, తెల్లటి పువ్వులు మరియు పండ్లు సమర్పించండి. ఓం ఉమామహేష్వాయ నమః అనే మంత్రాన్ని జపించండి. వీలైతే ఈ రోజున పేదవారికి దానం చేయండి.
Also read: Kamika Ekadashi 2022: కామిక ఏకాదశి అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook