Hariyali Teej 2022: శ్రావణ మాసం శుక్లపక్షం యెుక్క తృతీయ తిథి నాడు హరియాలీ తీజ్ జరుపుకుంటారు. ఈ ఏడాది హరియాలీ తీజ్ పండుగను (Hariyali Teej 2022) 31 జూలై 2022న అంటే ఆదివారం జరుపుకోనున్నారు. ఈ రోజున పార్వతీమాత, మహాదేవుల పునఃసంయోగం జరిగిందని నమ్ముతారు. అంతేకాకుండా ఇదేరోజు రవియోగం ఏర్పడబోతుంది. ఇది జూలై 31వ తేదీ మధ్యాహ్నం 2:20 గంటల నుండి ఆగస్టు 1వ తేదీ ఉదయం 6:04 గంటల వరకు రవియోగం ఉంటుంది. హరియాలీ తీజ్ రోజున కొన్ని ప్రత్యేక చర్యల తీసుకోవడం ద్వారా మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరిహారాలు చేయండి


>> సాధారణంగా దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి. హరియాలీ తీజ్‌లో ఈ పరిహారం చేస్తే.. ఎటువంటి సమస్య ఉండదు.  ఈ రోజున భార్యాభర్తలు పార్వతీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయాలి. పాలలో కాస్త కుంకుమపువ్వు వేయాలి.
>> వైవాహిక జీవితంలో మనస్పర్థలు లేకుండా..బంధం కలకాలం ఉండాలంటే.. హరియాలీ తీజ్ రోజున శివపార్వతులిద్దరినీ పూజించాలి. శివుడికి మందార పువ్వులను సమర్పించండి. 
>> సంతానం లేని దంపతులు హరియాళీ తీజ్ రోజున పేద ఆడబిడ్డలకు భోజనం పెట్టి దక్షిణ సమర్పిస్తే..వారికి సంతానం కలుగుతుంది. 
>> భార్యాభర్తల మధ్య విబేధాలు ఎక్కువగా ఉంటే.. హరియాలీ తీజ్ రోజున, పార్వతీమాతకు ఖీర్ సమర్పించి, ఈ ప్రసాదాన్ని తీసుకోండి.
>> తీజ్ రోజున పార్వతీమాతను పూజించిన తర్వాత అత్తగారి పాదాలను తాకి.. ఆమె ఆశీర్వాదాలు తీసుకోండి. దీంతో మీకు అత్తమామలకు మధ్య బంధం గట్టిపడుతుంది. 


Also Read: Shani Dev:ఈ శనివారం నాడు శని దేవుణ్ణి పూజిస్తే.. ఈ 3రాశుల వారికి పట్టిందల్లా బంగారమే 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook