Hariyali Teej 2023: హరియాలీ తీజ్ పండగ ప్రత్యేకత, పూజా సమయాలు, ఉపవాస వ్రతం పాటించడం వల్ల కలిగే లాభాలు!
Hariyali Teej Fasting Specialty In Telugu: హిందూ సాంప్రదాయంలో హరియాలీ తీజ్ పండగకి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ రోజు వివాహ స్త్రీలంతా శివపార్వతులకు పూజా కార్యక్రమాలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల భర్త ఆయుష్షు పెరగడమే కాకుండా వైవాహిక జీవితం కూడా మెరుగు పడుతుందని నమ్మకం.
Hariyali Teej Fasting Specialty In Telugu: హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. శ్రావణంలో రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి, హరియాళీ తీజ్ వంటి చాలా పండగలు వస్తాయి. అయితే ఈ పండగల్లో ఏంతో ముఖ్యమైన హరియాళీ తీజ్ గురించి తెలుసుకోబోతున్నాయి. ఈ పండగ ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ హరియాళీ తీజ్‌ను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజు జరుపుకుంటారు. ఈ పండగా రోజున శివపార్వతులను పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ ఆరాధనలో భాగంగా వివాహ స్త్రీలంతా ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తుందని నమ్మకం. అయితే ఈ హరియాళీ తీజ్ పండగ ఈ సంవత్సరం ఎప్పుడ జరపుకోవాలో..పూజా సమయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హరియాలీ తీజ్‌ని సింధర తీజ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?:
పెళ్లయిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు, ఈ క్రమంలో ఆమె అత్తమామలకు సింధారంతో పాటు మిఠాయిలు, గోరింట ఆకు, కంకణాలు పంపిస్తారు. ఇలా హరియాలీ తీజ్ సింధారాన్ని బహుమతిగా ఇవ్వడం ఆచారం. కాబట్టి ఇలా సమర్పించే క్రమంలో కొన్ని ప్రాంతాల ప్రజలు హరియాలీ తీజ్‌ని సింధర తీజ్ అని పిలుస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో శ్రవణ్ తీజ్ అని కూడా పిలుస్తారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
హరియాలీ తీజ్ పూజా సమయాలు:
శ్రావణమాసం శుక్ల పక్షమి తృతీయ తిథి ఆగస్టు 18 రాత్రి 08:01 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 19న రాత్రి 10:19 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం తిథుల్లో మార్పుల కారణంగా హరియాలీ తీజ్‌ని 19 ఆగస్టు శనివారం జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
హరియాళీ తీజ్ శుభ సమయాలు:
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04:25 నుంచి 05:09 వరకు
అభిజిత్ ముహూర్తం - ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు
విజయ్ ముహూర్తం - మధ్యాహ్నం 02:35 నుంచి సాంయంత్రం 03:28 వరకు
గోధూళి ముహూర్తం - సాంయంత్రం 06:57 నుంచి సాంయంత్రం 07:19 వరకు
సంధ్యాసమయం- సాంయంత్రం 06:57 నుంచి రాత్రి 08:03 వరకు
అమృత కాలం- సాంయంత్రం 05:44 నుంచి రాత్రి 07:32 వరకు
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి