Hartalika Teej 2022:  భాద్రపద మాసం మూడో రోజున హర్తాళికా తీజ్ వ్రతం జరుపుకుంటారు. ఈ పండుగను పెళ్లైన మహిళలు జరుపుకుంటారు. ఈ ఏడాది హర్తాళికా తీజ్ వ్రతం (Hartalika Teej Vratam 2022) ఆగస్టు 30న జరుపుకోనున్నారు.  ఈ రోజు ఉపవాసం ఉండి పదహారు రకాల వస్తువులతో పార్వతీపరమేశ్వరులను పూజిస్తారు. భర్త యెుక్క దీర్ఘాయష్షు మరియు శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. హర్తాళికా తీజ్ వ్రత శుభ సమయం, వ్రత విధాన గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హర్తాళికా తీజ్ 2022 ముహూర్తం
హర్తాళికా తీజ్ తిథి 29 ఆగస్టు 2022న మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై.. 30 ఆగస్టు 2022న మధ్యాహ్నం 3:34 గంటలకు ముగుస్తుంది. హర్తాళికా తీజ్ రోజున పూజకు అనుకూలమైన సమయం ఉదయం 9.33 నుండి 11.05 వరకు. మరోవైపు, ప్రదోష కాల పూజ ముహూర్తం ఆగస్టు 30, 2022న ఉదయం 6.34 నుండి రాత్రి 8.50 గంటల వరకు ఉంటుంది.


హర్తాళికా తీజ్ 2022 పూజ సామగ్రి
హర్తాళికా తీజ్ ఉపవాసం చేయడం చాలా కష్టం. ఆహారం, నీరు ముట్టుకోకుండా ఈ ఉపవాసం చేయాలి. ఈ వ్రతం యెుక్క పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం. 
ఎండు కొబ్బరి, కలశం, బిల్వపత్రం, శమీ ఆకు, అరటి ఆకు, దాతుర 
నెయ్యి, తేనె, చందనం, మంజరి,  ఐదు రకాల పండ్లు, తమలపాకులు, చెక్క, ధూపం, దీపం
వినాయకుడికి అర్పించేందుకు కర్పూరం, కుంకుం, గంగాజల్, దుర్వ
హర్తాళికా తీజ్‌లో సుహాగ్ బాక్స్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఇందులో కుంకుమ, మెహందీ, బిందీ, బీచియా, కాజల్, కంకణం, దువ్వెన, మహోర్ ఉంటాయి.


Also Read: కన్య రాశిలో బుధ సంచారం... రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook