Shining Teeth Tips: మెరిసే దంతాల కోసం వంటింటి చిట్కాలు..
Yellow teeth Remedies: మీ దంతాలు తెల్లగా మెరవలా? మీ పళ్లు పసుపు రంగులో మారాయా? అయితే పరిష్కార మార్గాలు ఇవిగో..
Yellow teeth Remedies: ఫేస్ లో మీ నవ్వును ప్రతిబింబించేవి మీ దంతాలే. అలాంటి దంతాలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పసుపులో రంగులోకి మారుతున్నాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా మీరు ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందుకే పళ్లను ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పసుపు దంతాలను వదిలించుకోవడానికి (Yellow teeth Remedies) కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుందాం. .
పసుపు దంతాలకు కారణమయ్యేవి:
1. టీ, కాఫీ, వైన్ మరియు సోడా వంటి ఇతర రకాల పానీయాలు రోజువారీ తీసుకోవడం
2. సరైన దంత పరిశుభ్రత పాటించకపోవడం
3. నోటి ద్వారా శ్వాస
4. బ్లూబెర్రీస్, చెర్రీస్, దుంపలు లేదా దానిమ్మ వంటి కొన్ని ఆహారాలు
5. కొన్ని మందులు
6. చక్కెర పానీయాలు
7. ధూమపానం, పాన్ మసాలా, పొగాకు మొదలైనవి.
పసుపు దంతాలను వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు..
1. బేకింగ్ సోడా
పళ్ళు తెల్లబడటానికి సహజ పరిష్కారాలలో ఒకటి బేకింగ్ సోడా. దీనిని సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. బేకింగ్ సోడాను పటిక పొడిని సమాన నిష్పత్తిలో కలపి బ్రష్ చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేయండి. మీరు బేకింగ్ సోడాతో టూత్‌పేస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు.
2. వేప పుల్ల
వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనలో చాలా మంది ఇప్పటికీ వేప పుల్లను బ్రష్ గా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు పసుపు రంగును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ దంతాలను తెల్లగా చేయడంతోపాటు చిగుళ్లను బలోపేతం చేస్తుంది.
3. పండ్ల తొక్కలు
పండ్లు మీ దంత ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండు, నిమ్మకాయ లేదా నారింజ తొక్క మరియు స్ట్రాబెర్రీ పేస్ట్‌ని మీ దంతాలకు అప్లై చేయడం వల్ల తెల్లగా మెరవడంతోపాటు బలంగా తయారువుతాయి.
4. కొబ్బరి నూనె
నోటిని పరిశుభ్రంగా ఉంచడంలో కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. ఇది మీ దంతాలను తెల్లగా చేయడంలోనూ, మెరిసేలా చేయడంలోనూ ఇది సూపర్ పనిచేస్తుంది. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ మంటను తగ్గించి బ్యాక్టీరియాను చంపుతుంది.
సహాయపడుతుంది.
5. పవిత్ర తులసి
ఎండిన తులసి ఆకులను ఆవాల నూనెతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని దంతాలపై రాయండి. దీంతో మీ పళ్లు తెలతెల మెరుస్తాయి. తులసి మౌత్ వాష్ యాంటీప్లాక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
Also read: Guru Vakri 2022: మీనంలో త్రికోణ రాజయోగం... ఈ 3 రాశులవారికి అంతులేని ధనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook