Ugadi 2024 effect on Zodiac Signs: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఉగాది కూడా ఒకటి. ఈ పండుగ నుంచి హిందూ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ ఫెస్టివల్ ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 09న రాబోతుంది. ఇదే రోజు దాదాపు 30 ఏళ్ల తర్వాత మూడు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శష్ రాజయోగం ఇదే రోజు రూపొందుతున్నాయి. దీంతో మూడు రాశులవారు లాభడనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి
మకర రాశి వారు కొత్త ఏడాదిలో ఎన్నో ప్రయోజనాలు పొందబోతున్నారు. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. 
మేషరాశి
హిందూ నూతన సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. 
వృషభ రాశి 
ఉగాది నుంచి వృషభరాశి వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. వ్యాపారస్తులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Budh Uday 2024: రేపు ఉదయించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..


Also Read: Zodiac Signs: హోలీకి ముందు ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది.. ఇందులో మీ రాశి కూడా ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి