Holi Festival 2022: హిందూ మతంలో హోలీ పండుగ (Holi Festival) చాలా ముఖ్యమైనది. గొప్ప భక్తుడైన ప్రహ్లాదుని దేవుడే రక్షించిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రంగుల పండుగ మనసులో ఆనందాలను నింపుతోంది. లక్ష్మీదేవిని (Goddess Laxmi) ప్రసన్నం చేసుకునేందుకు హోలీ ఫెస్టివల్ ముఖ్యమైనది. హోలికా దహనం (Holika Dahan) రోజున కొన్ని చిట్కాలు పాటిస్తే.. జీవితంలోని అనేక సమస్యలు దూరం కావడమే కాకుండా, చాలా డబ్బు కూడా వస్తోంది. ఈ సంవత్సరం హోలికా దహన్ గురువారం మార్చి 17, 2022న వచ్చింది. హోలికా దహనం రోజు ఈ కింది విధంగా చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం పొందాలంటే..:
హోలికా దహనం రోజున, ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. దీని తరువాత, లక్ష్మిదేవితో పాటు విష్ణువు, రాధా-కృష్ణులను పూజించండి. సాయంత్రం, కుటుంబంలోని ఒక సభ్యుడు కొబ్బరికాయను కొట్టి హోలికా దహన్ అగ్నిలో వేస్తారు. ఈ ట్రిక్ డబ్బు పొందడానికి అనేక మార్గాలను చూపుతోంది.


డబ్బు కొరత పోవాలంటే..:
హోలికా దహన్ రోజు చాలా ప్రత్యేకమైనది. హోలీ రోజున దానం చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది.


ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలంటే...: 
మీరు ఏదైనా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లయితే.. హోలికా దహనానికి ముందు, చెక్క కుప్పను పూజించి, దానికి స్వీట్లు, పండ్లు సమర్పించండి. దీని తరువాత, హోలికా దహనం సమయంలో, హోలికా అగ్నికి గోధుమలు, శనగలను సమర్పించండి. ఇంట్లోని స్త్రీలు ఈ పరిహారం చేస్తే లక్ష్మిదేవి చాలా సంతోషిస్తుంది.  త్వరలో అన్ని ఆర్థిక కష్టాలు తీరుతాయి.


Also Read: Venus Transit 2022: శుక్రుని అనుగ్రహం.. మరికొద్దిరోజుల్లో ఈ 3 రాశుల వారు ధనవంతులవుతారట...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook