Holi 2022: ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషకరమైన, దుఃఖకరమైన లేదా నష్టాలకు దారితీసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. కానీ, కొన్నిసార్లు బ్యాడ్ టైమ్ మనల్ని ఎక్కువగా వెంటాడుతుంది. అలాంటి పరిస్థితిలోనే కొందరు జోతిష్క్యులు లేదా ఏదైనా పరిష్కారాల కోసం ఆశ్రయిస్తుంటారు. కొన్ని రెమిడీస్ పూర్తి చేసిన తర్వాత వాటి నుంచి ఉపశమనం పొందుతారనేది కొందరి నమ్మకం. అయితే కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు లేదా రెమిడీస్ చేయడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాంటి ఓ రెమిడీని ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పుల భారం తగ్గాలంటే..


మరికొద్ది రోజుల్లో హోలీ పండుగ రానుంది. మార్చి 18న దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రంగుల పండుగను జరుపుకోనున్నారు. అయితే ఈ రోజున పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని జోతిష్క్యులు అంటున్నారు. 


అప్పుల బెడద తొలగిపోవడం సహా అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ రోజున పిండి దీపంతో ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారికి ఈ పరిష్కారం లభిస్తుంది. 


ఇలా పూజ చేయండి!


పిండితో 5 ముఖాలు కలిగిన దీపాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత అందులో ఆవాల నూనెతో నింపాలి. దీంతో పాటు అందులో కొద్దిగా నల్ల నువ్వులు, కుంకుమ, ఒక రాగి నాణెం వేయాలి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించి.. గుమ్మానికి ఎదురుగా ఓ ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. దీపం పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాలి. అలా చేసిన తర్వాత మీ ముఖంతో పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీ మనసులో నెలకొన్ని భయాందోళనలు తొలగడం సహా అప్పు వాళ్ల బెడద తగ్గుతుంది.  


Also Read: Palmistry predictions: మీ అరచేతి ఆకారం, రంగు చూసి భవిష్యత్ తెలుసుకోవచ్చట!


Also Read: Hindu God: హనుమాన్, వినాయకుడు, కృష్ణుడు, శంకరుడు.. దేశంలో ఏ దేవుడు ఫేమస్..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


Horoscope TodayHoroscope Today March 5 2