Holi 2023 Date: కులమతాలకు అతీతంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో హోలీ ఒకటి. ఈపండుగ ముందు రోజున హోలికా అనే రాక్షసిని దహనం చేస్తారు. తర్వాత రోజు చైత్ర కృష్ణ ప్రతిపాదంలో హోలీ ఆడతారు. దీనినే దుల్హేంది అంటారు. కానీ ఈ సంవత్సరం హోలికా దహనం భద్ర నీడలో ఉంది. హోలికా దహనం యెుక్క శుభ సమయం మరియు భద్ర సమయాన్ని తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫాల్గుణ పూర్ణిమ 2023 తేదీ 
వైదిక క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ మార్చి 06న సాయంత్రం 04:16 గంటలకు ప్రారంభమై.. మార్చి 07న సాయంత్రం 06:08 గంటలకు ముగుస్తుంది. ఉదయతి తిథి ప్రకారం, ఫాల్గుణ పూర్ణిమ స్నానం మరియు దానం మార్చి 07న ఉంటుంది. ఈ రోజున హోలికా దహనం చేస్తారు. తర్వాత రోజున అంటే మార్చి 08న హోలీ ఆడతారు. 
హోలికా దహనం శుభ సమయం 
పంచాంగం ప్రకారం, హోలికా దహనానికి అనుకూలమైన సమయం మార్చి 7 సాయంత్రం 06.24 నుండి 8.51 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలో హోళికను దహనం చేయవచ్చు.
భద్ర ముహూర్తం
భద్ర పూంచ్: మార్చి 7 అర్ధరాత్రి 1:02 నుండి 2:18 వరకు.
భద్ర ముఖం: మార్చి 7 అర్ధరాత్రి 2.18 నుండి 4.29 వరకు.


హోలీ ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, ప్రహ్లాదుడు విష్ణువు యొక్క అపారమైన భక్తుడు. ఇతడి తండ్రైన హిరణ్యకశ్యపుడు విష్ణుద్వేషి. హరిభక్తిని వీడమని ఎన్నోసార్లు కొడుకుని హెచ్చరిస్తాడు ప్రహ్లాదుడు. కానీ అతడు మానడు. దీంతో హిరణ్యకశ్యపుడు రకరకాల చిత్రహిసంలకు గురిచేసి చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ ప్రహ్లాదుడు చావడు. హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా. ఈమె ప్రహ్లాదుడిని హతమార్చాలని చూసి అగ్నిలో పడి దనహమవుతుంది. దీని కారణంగా హోలీ ముందు హోలికా దహనం చేస్తారు. హోలీ రోజున హనుమాన్ లేదా శివుడిని పూజిచడం వల్ల మీరు అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు. 


Also Read: Shani dev: రాహువు యెుక్క నక్షత్రంలోకి ప్రవేశించబోతున్న శని.. మార్చి 14 నుండి ఈ రాశులకు మనీ మనీ మోర్ మనీ...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook