Holi Colour: హోలీ రోజు ఏ రాశి వారు ఏ కలర్ తో హోలీ ఆడాలో తెలుసా?
Holi 2024: దేశం మెుత్తం రంగుల హోలీని జరుపుకోవడానికి ముస్తాబైంది. అయితే ఈ రోజున మీ రాశిచక్రం ప్రకారం, రంగులతో హోలీ ఆడితే మీకు అంతా మంచే జరుగుతోంది. ఏ రాశి వారు ఏ కలర్ వాడాలో తెలుసుకోండి.
Holi 2024 today: ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం ఈరోజే(మార్చి 25) ఏర్పడబోతుంది. పైగా ఇవాళ హోలీ పండుగ కూడా. అయి ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు, కాబట్టి హోలీ ఫెస్టివల్ పై పెద్దగా ప్రభావాన్ని చూపదు. దేశవ్యాప్తంగా హోలీని కులామతాలకు అతీతంగా జరుపుకుంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజునే శ్రీకృష్ణుడు పూతన అనే రాక్షసిని వధించాడట. ఈ పండుగను శివకేశవుల గుర్తుగా కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈశుభదినాన కామదహనం కూడా చేస్తారు. ఈ పండుగ ప్రేమ, సోదరభావం మరియు ఆనందాల ప్రతీక. హోలీ ఆడే సమయంలో మీ రాశిని బట్టి రంగులు ఉపయోగిస్తే మీకు అంతా శుభం జరగడమే కాకుండా మీ జీవితంలో అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. హోలీ నాడు ఏ రాశి వారు ఏ రంగుతో హోలీ ఆడాలో తెలుసుకుందాం.
మేషం- మేష రాశి వారు పసుపు రంగుతో హోలీ ఆడటం వల్ల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది.
వృషభం- నీలం రంగుతో వృషభ రాశి వారు హోలీ ఆడటం వల్ల వారి కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
మిథునం- ఈ రాశి వారు కూడా నీలం రంగుతోనే హోలీ ఆడటం మంచిది. దీంతో మీ వ్యక్తిగత మరియు జీవితంలోని సమస్యలు దూరమవుతాయి.
కర్కాటకం- కర్కాటక రాశి వారు హోలీ రోజున వీలైనంత వరకు పసుపు రంగును వాడండి, అది మీకు లక్ ను ఇస్తుంది.
సింహం- ఈ రాశి వారు ఎరుపు రంగుతో హోలీ చేసుకోండి. దీంతో మీ ఒత్తిడి దూరమై.. ఆనందంగా ఉంటారు.
కన్య - తెల్లటి రంగు లేదా చందనంతో కన్యా రాశి వారు హోలీ ఆడటం వల్ల పెండింగ్ వర్క్స్ అన్నీ పూర్తవుతాయి.
తులారాశి- తుల రాశి వారు ఆకుపచ్చ రంగుతో హోలీ ఆడటం మంచిది. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని ఇస్తుంది.
వృశ్చిక రాశి- తెలుపు రంగుతో హోలీ ఆడటం వల్ల వృశ్చిక రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. మీ ఒత్తిడి దూరమవుతుంది.
Also Read: Surya Gochar 2024: దాదాపు 12 ఏళ్ల తర్వాత కలవబోతున్న సూర్యుడు-గురుడు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ పక్కా..
ధనుస్సు- ధనుస్సు రాశి వారు గులాబీ రంగుతో హోలీ జరుపుకోవడం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలోని సమస్యలన్నీ దూరమవుతాయి.
మకరం- ఆకుపచ్చ రంగుతో మకర రాశి వారు హోలీ ఆడితే.. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
కుంభం- కుంభ రాశి వారు వెండి రంగుతో హోలీ ఆడటం కలిసి వస్తుంది. ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మీనం- నారింజ రంగుతో మీనరాశి వారు హోలీ ఆడటం మంచిది. దీంతో ఇతరులతో మీ బంధం బలపడుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Shani Dev: హోలీ తర్వాత నక్షత్రాన్ని మార్చనున్న శని... ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి