Today Horoscope January 11 2022: మనం సాధారణంగా ఏ పని మెుదలుపెట్టాలన్నా, ఏ ఫంక్షన్ చేయాలన్నా జాతకం ఎలా ఉందో చూస్తాం. మంచి, చెడుల గురించి ఆలోచిస్తాం. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 12వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం
ఈ రోజు ఈ రాశి వారు గొడవలు జోలికి పోకూడదు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో లాభం చేకూరుతుంది. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తే.. అనుకున్న పనులు జరుగుతాయి.


వృషభం
వీరు ప్రారంభించబోయే పనులలో కొన్ని ఆటంకాలు తప్పవు. ఎవరితోనూ  మాట పట్టింపులకు పోవద్దు. క్రమంగా ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్ఫలితాలను సొంతం చేసుకుంటారు. 


మిథునం
విందూ వినోదాల్లో పాల్గొంటారు. బంధువుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు హనుమంతుడి ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది. 


Also Read: Zodiac Signs of Billionaires: ప్రపంచంలోని టాప్ బిలియనీర్స్ రాశులేంటో మీకు తెలుసా...


కర్కాటకం
ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. 


సింహం
ప్రారంభించిన పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. 


కన్య
ఈ రాశి వారు మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. 


తుల
వృత్తి,ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. 


వృశ్చికం
లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని విరోధించే వారితో జాగ్రత్త. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది. 


ధనస్సు
శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. 


మకరం
ఆచి తూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్దిస్తాయి. ప్రారంభించబోయే పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.


కుంభం
గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి.  ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. 


మీనం
ఈరోజు ఈరాశివారు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook