Horoscope Today: ఏదైనా కొత్త పనులు మెుదలుపెట్టాలన్నా, ఫంక్షన్స్ చేయాలన్నా ఈరోజు ఎలా ఉంటుంది.. అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 25 వ తేదీ) మంగళవారం (Tuesday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): ఈ రోజు ఈ రాశివారికి మీదైనా రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ధర్మసిద్ధి ఉంది.


వృషభం (Taurus) : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. 


మిధునం (Gemini): ఏ పని చేపట్టిన ఆటంకాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాలు జోలికి పోకుండా ఉంటే మంచిది.


కర్కాటకం (Cancer): గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధి సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. 


Also Read: Hanuman Photo Vastu: హనుమాన్ ప్రతిమ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటికే అరిష్టం!


సింహం (Leo): ఈ రోజు ఈరాశివారికి శుభకాలం నడుస్తోంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.


కన్య (Virgo) : మెుదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు.అవసరానికి సహాయం చేసేవారున్నారు. మంచి సమయం. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. 


తుల (Libra) :  ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. 


వృశ్చికం (Scorpio) : ఈ రోజు ఈ రాశివారికి సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ఘటనలు బాధ కలిగిస్తాయి. 


ధనస్సు (Sagittarius) : వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. 


మకరం (Capricorn): మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 


కుంభం (Aquarius) : ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభదాయకమైన కాలం. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పరిస్థితులు తారుమారు కాకుండా ముందుగా జాగ్రత్త పడటం మంచిది. 


మీనం (Pisces) : ఈ రోజు ఈరాశివారి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook