Horoscope March 2022: మార్చి నెలలో ఆ రెండు రాశుల వారికి అంతా అనుకూలమే..!
Horoscope March 2022: మరో రెండు రోజుల్లో మార్చి నెల ప్రారంభం కానుంది. మరి వచ్చే నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండనుంది? జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు మీకోసం.
Horoscope March 2022: ఈ నెలలో శని, శుక్ర గ్రహాలు పరివర్తనం చెందారు. రేపటితో ఫిబ్రవరి ముగియనుంది. కాబట్టి మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండనుంది? అనే విషయంపై జ్యోతిష్య నిపుణులు చెబుతున్న నెలవారీ రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేష రాశి
ఈ రాశి వారి మార్చి నెలలో ఏదైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలి. అనవసర గొడవల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తొచ్చు. ప్రియమైన వారి నుంచి మనకు ఆనందం కలుగుతుంది. మానసిక ప్రశాంతతకోసం ప్రాణాయామం చేయడం ఉత్తమం.
వృషభ రాశి
ఈ రాశి వారికి వచ్చే నెల ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ప్రశాంత లోపించడం, ఆందోళన పెరగటం వంటివి చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాల్సిన సమయమిది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
మిథున రాశి
ఈ రాశి వారికి కూడా మార్చిలో కష్టాలు ఉంటాయి. అయితే మంచి విషయమేమింటే.. మీ సమస్యలు పరిష్కరించుకునేందుకు అనేక మార్గాలు కనిపిస్తాయి. అయితే మీరు ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దైవ ఆరాధన ద్వారా మేలు జరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మార్చి సానుకూలంగా సాగుతుంది. నెలాఖరున శుభవార్త వినే అవకాశముంది. పని ఒత్తిడి పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది.
సింహ రాశి
ఈ రాశి వారికి వచ్చే నెలలో సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఏదైన పని చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి. మీరు చేసే పనులు మిమ్మల్ని ఇతర నుంచు ప్రత్యేకంగా చూపుతాయి.
కన్య రాశి
కొత్త పనులు ప్రారంభిస్తారు. మీరు చేసిన కొన్ని పనుల ఫలితాలు వచ్చే నెలలో అందుతాయి. వచ్చే నెలలో ఎంతో ఉత్సహంతో ముందుకు సాగుతారు. మీ అమ్మగారి నుంచి ఓ మంచి వార్త వింటారు.
తుల రాశి
ఈ రాశి వారు మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. ఉద్యోగులకు తోటి ఉద్యోగుల నుంచి లేదా సంఘంలో ఇతర వ్యక్తుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఇతరుల పట్ల లౌక్యంతో వ్యవహరించడం ద్వారా మేలు జరుగుతుంది.
వృశ్చిక రాశి
కొత్త పరిచయాలు ఏర్పడటం అవి మరింత బలపడతాయి. వచ్చే నెలలో శుభవార్త వింటారు. చేసే పనిలో అంకితభావం ఉండాలి అప్పుడే ఫలితాలు సంపూర్ణంగా అందుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
ధనుస్సు రాశి
గతంలో చేసిన పొరపాట్లు మీకు పాఠాలు నేర్పిస్తాయి. వచ్చే నెలలో ఆ అనుభవాన్ని ఉపయోగించి జాగ్రత్తగా మసులుకోవాలి. అలా చేస్తే మీలో మార్పులను మీరే గమనించవచ్చు.
మకరం
ఈ రాశి వారికి అవసరానికి సహాయం అందుతుంది. పట్టుదలతో శ్రమించడం ద్వారా మీకు వచ్చే నెలలో మేలు జరుగుతుంది. అయితే చేసే పనిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.
కుంభ రాశి
మీరు మానసికంగా ఒత్తిడిని దూరం చేసుకోవడం మంచిది. అనుకున్న పనిని గడువులోపు పూర్తి చేయండి. శివుడికి నిత్యం పూజలు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
మీనం
ఈ రాశి వారు తాము చేయాలనుకుంటున్న పనుల గురించి ఆత్మీయులతో పంచుకోవడం వల్ల విలువైన సలహాలు సూచనలు పొందొచ్చు. గాయాలపాలయ్యే అవకాశముంది. వచ్చే నెలలో వీలైనంత జాగ్రత్త వహించాలి.
Aslo read: Vijaya Ekadashi 2022: ఏకాదశి రోజు ఈ తప్పులు చేయడం వల్ల మెుత్తం వంశం నాశనమవుతుంది!
Also read: Horoscope 2022 February 27: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు ఒక శుభవార్త వింటారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook