Horoscope Today, 03 February 2021: Today Rasi Phalalu in Telugu: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 3న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేష రాశి
Horoscope Today
ఈ రోజు సమయ పాలన మీకు చాలా కీలకం. మీ రోజును సరిగ్గా ప్లాన్ చేయనందున మీపై ఏదో బారం ఉన్నట్లుగా మీరు భావిస్తారు. ఏ విషయంలోనైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పేపరుపై మీకు కావాల్సిన విషయాలు రాసుకుని ఆలోచించి, ప్లాన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముందు జాగ్రత్త, ఆలోచనలతో మాత్రమే సమస్యలను అధిగమించుతారు.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు


 


వృషభ రాశి
వృషభం కొంత మార్పుకు మీరు అర్హులు. మీరు సుదీర్ఘకాలం నుంచి ఇరుతల కోసం ఎంతో శ్రమించారు. ఇక కొంతకాలం సెలవులు, విశ్రాంతి తీసుకోవడానికి తగిన తరుణమిది. మీ కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండేందుకు ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. మీతో ఒక స్నేహితుడినిగానీ లేదా మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తినైనా మీతో పాటు తీసుకెళ్లడం శుభసూచకం. మళ్లీ పనిలో నిమగ్నమయ్యేందుకు ముందు మీరు మరింత మానసిక ప్రశాంతను పొందండి.



మిథున రాశి
మీరు రెండు నిర్ణయాలలో ఏది తేల్చుకోవాలో అర్థంకాని పరిస్థితిని ఎదుర్కొంటారు. ఈ సమస్యపై ఆలోచనకు మీ మానసిక స్థితిని అనుమతించవద్దు. సరైన, న్యాయబద్ధంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. కీడు తెలుసుకన్న తర్వాతే మీ నిర్ణయంలో మంచి ఏ మేర జరుగుతుంతో యోచించాల్సిన సమయం ఇది. తద్వారా రెండు నిర్ణయాలలో మీకు పరిష్కారం లభిస్తుంది.


Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ



కర్కాటక రాశి
మీకు ఈ రోజు కొంత అస్తవ్యవస్తంగా పరిస్థితి గోచరిస్తుంది. ఎత్తుపల్లాలు చూడాల్సి వస్తోంది. ఇది మిమ్మల్ని భావోద్వేగ స్థితిలో ఉంచుతుంది కాబట్టి ఘర్షణకు బదులుగా మీ పనిలో నిమగ్నం కావడం శ్రేయస్కరం. ఈ రోజు ఇతరుల గురించి చింతించవద్దు. చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాధిస్తాయి. ఇతరులతో మాటలు, గొడవకు బదులు మిమ్మల్ని మీరు పనిలో తీరిక లేకుండా ఉండేలా చూసుకోండి.



సింహ రాశి
మీ సన్నిహిత సంబంధాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలుస్తుంది. ఇంట్లో కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి. అయితే మీ అభిప్రాయాలను మాత్రం ఇతరులపై రుద్దకూడదు. కేవలం అవతలి వారి అభిప్రాయల్ని విని తగిన సూచనలు అందించడం ఉత్తమం. దీంతో మీ సంబంధాలు మెరుగవుతాయి. ఎవరిపైనా మండిపడవద్దు. ప్రశాంతను కోల్పోకుండా చూసుకోవాలి.



కన్య రాశి
మీరు కొంతకాలం నుంచి ఒకరితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ఈ రోజు మీరు ఎదురుచూస్తున్నదాన్ని స్వీకరించబోయే రోజు. ఒకరి పట్ల భావాలు వ్యక్తం చేయడంతో పాటు వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుస్తాయి. ఈ రోజు ఎవరైనా మీ కోసం వారి భావాలను వ్యక్తం చేయవచ్చు. అందుకు మీరు సిద్ధంగా ఉండాలి.  మీరు ఇప్పటికే రిలేషన్‌లో కుండబద్దలు కొట్టినట్లు వారికి చెప్పడం శ్రేయస్కరం.


Also Read: ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, కారణమేంటో తెలుసా



తులా రాశి
ఈ రోజు తులా రాశి వారిలో ఎవరో ఆసక్తికి పెంచబోతున్నారు. మీరు కొత్త కోణంలో ఆలోచనలు మొదలుపెడతారు. మీరు ఎప్పుడూ చూడని స్నేహితుడి కోసం మీరు కొన్ని భావాలను పెంచుకోవచ్చు. అయితే దాని వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. అందుకే దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఇది సుదీర్ఘకాలం మీ స్నేహితులతో కొనసాగదని గ్రహించాలి.



వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు ఈరోజు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఈ రోజు మీ కార్యాలయంలో మీకు వేర్వేరు బాధ్యతలు అప్పగిస్తారు. మీరు మొదట దీన్ని సమస్యగా భావిస్తారు. అయితే ఈ విషయాలన్ని బహిర్గతం చేయకపోవడం ఉత్తమం. మీ నైపుణ్యాలు పనులను చేయడంలో మీకు సహాయపడతాయి. మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. మీరు పనిలో నిమగ్నమైతే కచ్చితంగా విజయం సాధించగలరు.



ధనస్సు రాశి
మీ గురించి మీరు సాధారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మీ రోగనిరోధక శక్తి ఈ రోజు సన్నగిల్లుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. అనారోగ్య సూచన కారణంగా మీ పనులు జాప్యం అవుతాయి. అయితే విశ్రాంతి తీసుకుని పనులపై నిమగ్నం కావాల్సిన సమయమిది.


Also Read: Copper Health Benefits: రాగి కడియం ధరించే అలవాటు ఉందా, Copper Benefits తెలుసుకోండి



మకర రాశి
మీ భావోద్వేగాల విషయానికి వస్తే మీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ రోజు మకర రాశి వారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఇతరుల వల్ల మీరు మితిమీరిన అనుభూతి చెందవచ్చు. అయితే మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులతో పంచుకోవడానికి యత్నిస్తారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.



కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ రోజు మీ ప్రేమ జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ భాగస్వామి నుండి ఆనందం పొందుతారు. దాంతోపాటు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు తెలుస్తాయి. మీరు మీ ప్రేమను ఎవరితోనైనా వ్యక్తపరచాలనుకుంటే, దైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే మీరు ఇష్టపడిన కొంతమంది వ్యక్తుల నుండి మీకు మంచి స్పందన వస్తుంది.



మీన రాశి
మీరు ఇటీవల కొన్ని విషయాలపై చాలా దృష్టిసారించారు. స్నేహితుల బృందంతో కలిసి ఏదైనా విహారయాత్ర వెళ్లే సూచన కనిపిస్తుంది. అయితే ఇంటికి దగ్గరగా ఉండడం, చాలా దూరం వెళ్లకపోవడం క్షేమదాయకం. వాహనాలలో ప్రయాణాలు నేడు మిశ్రమ ఫలితాల్ని సూచిస్తుంది. తగినంత విరామం తీసుకుని పని మొదలుపెడితే మీకు లాభాలు గోచరిస్తున్నాయి. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook