Horoscope Today, 05 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.  మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 5న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు(Today Rasi Phalalu in Telugu) అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మేష రాశి
ఈ రాశి వారికి కొన్ని సంబంధాలు ఈ రోజు ఎక్కువసేపు ఉండే సూచన. పనిలో మరియు మీ వ్యక్తిగత జీవితంలో కొందరు మీకు కృతజ్ఞత చూపుతారు. దీనివల్ల మీకు కొన్ని ఆసక్తికరమైన భవిష్యత్ మార్గాలను తెరుస్తుంది. మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతాయి. కనుక కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెబుతూ ముందుకు సాగాలి.


Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ


 


వృషభ రాశి
మీ ప్రస్తుత పరిస్థితులతో కాస్త విసిగిపోయినట్లు భావిస్తారు. అయితే మీ భావన నిజమో కాదో తెలుసుకునేందుకు యత్నించండి. మీరు నమ్మింది నిజమే అయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. సమస్యల నుంచి బయట పడేందుకు ఇది ఒక మంచి అవకాశం. మీ కోసం ప్రయత్నాలు చేస్తే కార్యసిద్ధి. మీ స్థలం మీకు అవసరమని ఇతరులకు స్పష్టంగా చెప్పడంతోనే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.


 


మిథున రాశి
ఈ రోజు ఓపెన్ మైండ్‌తో ఆలోచించాలి. లేకపోతే మీ చుట్టూ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎటువంటి సాక్ష్యాలు మీ వద్ద లేకుండా దేనిని, ఎవరినీ అనుమానించరాదు. అయితే మీకు ఈరోజు మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


 


కర్కాటక రాశి
మీరు మీ మనసుతో ఆలోచిస్తారు. మీ హృదయంతో అనుభూతి చెందుతారు, అందువల్ల కొంతమేర బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు పెద్దగా ఆలోచించనప్పటికీ, కొన్ని విషయాలను వదిలివేయడానికి ఇష్టపడరు. మీ భావాలలో ఎక్కువ సమయం గడపడం వల్ల మోసపోయే సూచన ఉంది. మీరు చాలా సున్నితమైనవారు కాబట్టి, ఇతర వ్యక్తులు తమ అవసరాల కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మీరు మాత్రం ఇతరులపై ఆధారపడకూడదని తెలుసుకోండి.


 


సింహ రాశి
మీరు పెద్ద మనసుతో ఆలోచిస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తిపై కొంతకాలం నుంచి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు మీ సహచరులకు నమ్మకంగా ఉన్నారు, అందువల్ల వారి మీతో ప్రేమ, ఆరాధన భావంతో ఉంటారు. ఇతరులను క్షమించటానికి మీరు ఎక్కువ సమయం తీసుకోరు. కొన్ని విషయాలు మీకు తెలియగా ప్రత్యేక అనుభూతి చెందుతారు.


Also Read: Copper Health Benefits: రాగి కడియం ధరించే అలవాటు ఉందా, Copper Benefits తెలుసుకోండి


 


కన్య రాశి
మీరు చాలా మంచి వ్యక్తిత్వంతో ముందుకుసాగుతారు. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు బాగానే ఉంటారు. మీ తోటివారు, సహోద్యోగులు కొన్ని పరిస్థితులతో ఇబ్బందిపడుతున్నారని తెలిసి మీ వంతు సాయం చేయడానికి యత్నిస్తారు. అయితే సానుకూలంగా వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసించాలి. మీరు ఒంటరిగా ఉండటానికి మార్గాలను అన్వేషిస్తారు.


 


తులా రాశి
మీ వల్ల ప్రభావితం కాని పరిస్థితుల గురించి మీరు అనవసరంగా యోచిస్తారు. మీరు మచ్చలేని వ్యక్తిగా అంకితభావంతో ఉంటారు. మీ పనిలో అధికంగా శ్రమిస్తారు. ఇది మంచి  ఫలితాలకు దారి తీస్తుంది. పని మరియు వ్యాయామం అవసరమని గుర్తించాలి. ప్రతిరోజూ వ్యాయామం లేదా నడక లాంటి శారీరకశ్రమకు ఒక గంట సమయం కేటాయించండి


 


వృశ్చిక రాశి
కొన్ని ముఖ్యమైన పనులలో నిమగ్నమై ఉండటం వల్ల మీరు పురోగతి సాధించవచ్చు. ఏదేమైనా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో ఇతరుల సాయాన్ని కోరతారు. మీరు వాటిపై మీ నియంత్రణను నిరంతరం కొనసాగించలేరు. మీరు విశ్వాసపాత్రులగా ఉన్నందున కొందరు మిమ్మల్ని ప్రేమగా, ఆప్యాయతతో చూస్తారు.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు


 


ధనస్సు రాశి
మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల మీరు ఇబ్బందులు పెరుగుతాయి. మీకు ధనలాభం కలిగే సూచనలు గోచరిస్తున్నాయి. ఖర్చు చేయడంపై రెండవ ఆలోచనలు చేయరు.  మీ వృత్తిపై దృష్టి కేంద్రీకరించి విజయాన్ని అందుకుంటారు. డబ్బు భద్రపరిచినా, ఖర్చు చేసినా మీపై ఎలాంటి నిందలు పడవు. పనిలో మీకు సహాయపడే వ్యక్తులతో అనుబంధాన్ని కొనసాగించరు. ఏదేమైతేనేం ఈ రోజు మీరు వారి శ్రమకు విలువ ఇచ్చే సూచన ఉంది.


 


మకర రాశి
మీరు మీ శక్తిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. మీ మనస్సులో ఉన్న లక్ష్యాన్ని చేరుకోవటానికి పని మీద దృష్టి పెట్టండి. మీరు నమ్మకంతో పని చేస్తారు మరియు మీ చుట్టూ ఉన్న వారిని అదే విధంగా చేయాలని కోరండి. పని చేసేవారికే తిండి అనే సూత్రంపై మీరు నేడు ముందుకు సాగుతారు.


 


కుంభ రాశి
మీరు మీ అవకాశాన్ని గౌరవిస్తున్నందున మిమ్మల్ని కొందరు తీసివేయాలని కోరుకుంటారు. మీతో నిజాయితీగా ఎవరైనా చేర్చడాన్ని సైతం సహించరు. ఇతరులతో వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించరు. మీరు ధిక్కారమైన మనస్సుతో ముందుకు సాగనున్నారు. దీని కారణంగా మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు మీ ఆందోళనను ఎవరితోనైనా పంచుకుంటే మీకు శ్రేయస్కరం.


 


మీన రాశి
మీరు నిరాడంబరంగా ఉంటారు. మరియు కొత్త సహచరులను తీసుకురావడం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. మీ పాత సహోద్యోగులతో బాగానే ఉన్నారు. మీ ప్రియమైన సహచరులతో కలిసి ముందుకు సాగుతారు. మీనరాశి వారు ఇతరులను ఏది తిరిగి ఆశించకుండా వారికి తోచిన పనులు, సాయం చేస్తారు. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook