Horoscope Today 07 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.  మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 7న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేష రాశి
చిన్న విషయాలపై దృష్టి పెట్టడం పని  ప్రారంభించడానికి మంచిది కాదు. నిజం చెప్పాలంటే మీ ఆలోచనలను వదలకపోతే ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అవసరమైతే ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో ఏదో ఒక చిన్న పనిని మాత్రమే చేయండి. మీకు అద్భుతమైన రోజున ప్రమాదకరమైన విషయాలను వదిలేసి ముందుకుసాగుతారు.


Also Read: Gold Price Today In Hyderabad: భారీగా పెరిగిన Gold Rates, పసిడి దారిలోనే Silver Price


 


వృషభ రాశి
ఈ రాశివారు పనిలో నిమగ్నమై ఉంటారు. మీరు ఇతర ప్రాంతానికి వెళ్లినప్పుడు గానీ, అందమైన అమ్మాయితో ఉన్నప్పుడుగానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. అద్భుతమైన సమయం పొందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం మీ పనుల గురించి మరచిపోయి వైవాహిక జీవితంపై దృష్టి పెడతారు. మీపై మన్మథుడి ప్రభావం కనిపిస్తుంది.


 


మిథున రాశి
చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు విశ్వసించే ఎవరైనా మీరు నమ్మినంత మంచి వ్యక్తులు కాకపోవచ్చు. ఆఫీసు పనులు లాంటి వాటిలో ఏ సమస్యలు లేవు. మీరు ప్రారంభించే కొత్త ప్రాజెక్టు విజయవంతం అవుతుంది. అయితే మీ స్నేహితులు, సహోద్యులను గమనిస్తూ ఉండాలి. మీ డబ్బు కారణంగా వారు మీ పంచన చేరే అవకాశాలు గోచరిస్తున్నాయి.


 


కర్కాటక రాశి
ఈరోజు మీ భుజాలపై అధిక ఒత్తిడి ఉంటుంది. అయినా సరే మీరు చింతించకండి. తాత్కాలికంగా మాత్రమే మీకు సమస్యలు ఉంటాయి. ఆఫీసులో మీ ఉన్నతాధికారులు ఈ రోజు మిమ్మల్ని నిశితంగా చూస్తున్నారు, కనుక పనిలో పూర్తి శ్రద్ధ వహించేందుకు ప్రయత్నించండి. ఈరోజు మాంసం లాంటి వాటికి దూరంగా ఉంటారు. సేంద్రీయ ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యంలో చేసిన పదార్థాలు భుజిస్తారు.


Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే


 


సింహ రాశి
మీరు చాలా చురుకుగా ఉండటం కొందరికి  ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు మీరు ఏ పని చేసినా, అనుమానాలు లేకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలి. నేడు మీకు అద్భుతంగా ఉంటుంది. కలిసొచ్చే విషయాలపై శ్రద్ధ వహించి, మీ సన్నిహితుల సలహాలను జాగ్రత్తగా పాటించాలి.


 


కన్య రాశి
కన్యా రాశి వారికి ఈరోజు వారు చెప్పిన ప్రతి విషయం జరుగుతుంది. ముందుగానే ఊహించిన విషయాలు జరగడం కొంత ఆశ్చర్యానికి సైతం గురిచేస్తుంది. మీరు దేనికి భయపడకుండా, నోరు తెరవాల్సిన సమయం ఆసన్న మైంది. మీ అనుభవం ఎవరికైనా వారి దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది.


 


తులా రాశి
తులా రాశి వారికి నేడు నగదు అవసరం పడుతుంది. ఇందుకోసం మీరు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. మీ అరుదైన ఆస్తులను తిరిగి చేజిక్కుంచుకోవడానికి, ఖర్చు చేయడానికి ముందడుగు వేస్తారు. ఖరీదైన పానీలు తాగడం, భోజనం చేయడం ద్వారా అధిక నగదు ఖర్చు చేయడానికి బదులుగా పొదుపుపై శ్రద్ధ వహించాలి. పరిస్థితి సాధారణం అయిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.


 


వృశ్చిక రాశి
భిన్నంగా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడానికి ఇదే సరైన తరుణం. ఏదైనా అడ్డంకి ఎదురైతే జయించడం చాలా సులభం అవుతుంది. మతం, సమాజం అనే అంశాలు వృశ్చిక రాశి వారిని ప్రభావితం చేయనున్నాయి. భావోద్వేగాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా పనులను ముందుకు తీసుకెళతారు.


ధనస్సు రాశి
మీరు విస్మరిస్తున్న విషయాలను తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. తద్వారా మీరు ఆశ్చర్యానికి లోనయ్యే కొన్ని సంఘటనలు మీరు తెలుసుకుంటారు. మీ లక్ష్యాలను తిరిగి పొందటానికి ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు చేయాలి. మీ మార్గం ఈరోజు సుగమం అవుతుంది. 


Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి


 


మకర రాశి
మీరు పొరుగువారితో పరిచయాలు పెంచుకుని స్నేహంగా మెలిగే సమయం. గత కొంతకాలం నుండి లేని అవకాశాన్ని ఇప్పుడు స్వయంగా కల్పించుకుంటారు. సాధ్యమైనంత ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకుని వారి స్వభావం, ఆలోచనలు తెలుసుకోవాలని కోరుకుంటారు.


కుంభ రాశి
ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. మీరు రక్షణ లేనివారని భావిస్తుంటారు. మీ ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతంటాయి. పాస్‌వర్డ్‌లు మార్చడం లాంటి సూచనలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణం లాంటి వాటిపై ఆలోచన మొదలువుతుంది. అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ నిర్ణయానికి మద్దతు లభిస్తుంది.


 


మీన రాశి
డేటింగ్ లాంటి విషయాల కారణంగా కొందరు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కాబట్టి మీరు ఆన్‌లైన్ ప్రొఫైల్‌ను చెక్ చేసుకుని ఇతరులతో సంబంధాలు ఏర్పరుచుకోవడం ఉత్తమం. వాటి వల్ల శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పనిలో మీకు ఆటంకాలు కల్పించే వారి నుంచి దూరంగా ఉండాలి. మీ పనితనం బాగుంటుంది కనుక మీతో ఉండటానికి సహోద్యోగులు ఆసక్తి కనబరుస్తారు. మీరు కళ్లు తెరిచి అన్ని విషయాలు గమనిస్తే ప్రయోజనం ఉంటుంది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook