Horoscope Today 11 August 2022: మేషం ( Aries): శుభకాలం నడుస్తోంది. మంచి  పనులు చేపడతారు. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడగలరు. గొప్పవారితో స్నేహం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. విహారయాత్ర కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): మిశ్రమ కాలం ఉంది. మీరు అసహనంగా ఉండాలి. మానసిక కల్లోలం బారిన పడవచ్చు.  అహంకారం పనికిరాదు.  శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.


మిథునం (Gemini): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మీరు సంతోషంగా ఉండవచ్చు. వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని అనుభవించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ కుటుంబం మీకు మద్దతు ఉంటుంది. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలు గడుపుతారు. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.


కర్కాటకం (Cancer): అన్ని రంగాల వారికీ శుభకాలం నడుస్తోంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో రివార్డుల పరంగా ప్రోత్సాహకాలు పొందవచ్చు. బంధు, మిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. కనకధారాస్తవం చదవాలి.


సింహం (Leo): మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో అందరి సహకారం అందుతుంది. ఈరోజు మీరు పేదవారికి సహాయం చేయడం వలన సమాజంలో కీర్తిని పెంచుతుంది. ప్రేమికులకు శుభకాలం. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.


కన్య (Virgo): ఈ రోజు అసంతృప్తిగా ఉండవచ్చు. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. మీ తల్లిదండ్రుల పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వర సందర్శనం శుభప్రదం.


తుల (Libra): ప్రతి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి మీ తోబుట్టువులు సహాయం చేయవచ్చు.  కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. కుటుంబ సమస్యలకు సంబంధించి కొన్ని చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. దుర్గాధ్యానం శుభప్రదం.


వృశ్చికం (Scorpio): శుభకాలం. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలాలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ప్రేమికులకు ఇంటి సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు విద్యా పరంగా శుభవార్తలు వింటారు. సూర్యారాధన శుభప్రదం.  


ధనస్సు (Sagittarius): పనికి సంబంధించి కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరగనుంది. కుటుంబంతో ప్రతి క్షణం ఆనందించవచ్చు. ఒక శుభవార్త  మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమం.


మకరం (Capricorn): మిశ్రమ కాలం నడుస్తోంది. ఈరోజు మీకు నిస్తేజంగా అనిపించవచ్చు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. నిద్రలేమికి గురయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.


కుంభం (Aquarius): ప్రతి పనిలో శ్రద్ధ అవసరం. ఈరోజు మీరు శక్తివంతంగా ఉంటారు. వ్యాపారంలో కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ నష్టాలు లాభంగా మారవచ్చు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడొద్దు. మీ పనితీరుతో పై అధికారుల నుంచి ప్రశంసించబడవచ్చు. సూర్యస్తుతి శక్తిని ఇస్తుంది. 


మీనం (Pisces): శుభకాలం నడుస్తోంది. మీ తెలివితేటలు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడవచ్చు. ఒక శుభవార్త మీ  ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతరుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


Also Read: Telangana BJP: మునుగోడు బైపోల్ వేళ బీజేపీ సంచలనం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తీన్మారేనా?


Also Read: Rakhi Festival 2022: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఇతడు ఏం పోస్ట్ చేశాడో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook