Horoscope Today 15 August 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల ప్రేమికులకు కలిసొచ్చే రోజు!
Today Astrological prediction for 15 August 2022. తుల, కుంభ రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల ప్రేమికులు విజయం సాధిస్తారు.
Horoscope Today 15 August 2022: మేషం (Aries): మిశ్రమకాలం నడుస్తోంది. పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచింది. కుటుంబసభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. శివ అష్టోత్తర పారాయణ చేయడం మంచిది.
వృషభం (Taurus): శుభకాలం. ఇష్టమైన వారితో సరదా కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవారాధన శుభదాయకం.
మిథునం (Gemini): చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో చేయాలి. శ్రద్ధతో పని చేస్తే గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసొచ్చే కాలం. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer): మొదలు పెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి అవసరం. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళతారు. శివ ఆరాధన మంచినిస్తుంది.
సింహం (Leo): మిశ్రమ కాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కంగారుపడిపోతారు. సమస్యలు అధికమవనున్నాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. దుర్గ ధ్యానం శుభప్రదం.
కన్య (Virgo): మిశ్రమకాలం. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సూర్య ఆరాధన శుభప్రదం.
తుల (Libra): మంచి విజయాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులు విజయం సాధిస్తారు. శివాభిషేకం శ్రేయస్సుని ఇస్తుంది.
వృశ్చికం (Scorpio): అన్ని రంగాల్లోని వారికీ పురోగతి ఉంటుంది. చేపట్టే పనుల్లో చాలా జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఇష్టమైన వారితో సరదా సమయం గడుపుతారు. శివ నామస్మరణ మంచిది.
ధనస్సు (Sagittarius): మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో పని చేస్తే పనులు జరుగుతాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఇతరుల జోలికి వెళ్ళకూడదు. విహార యాత్రకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.
మకరం (Capricorn): అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం
కుంభం (Aquarius): శుభకాలం నడుస్తోంది. చేపట్టిన పనులను దైవానుగ్రహంతో పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు కలిసొచ్చే రోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
మీనం (Pisces): చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ వెంట దైవబలం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదా సమయం గడుపుతారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా దర్శనం మంచిది.
Also Read: ఆ ఊబిలో నుంచి అందుకే బయటపడ్డా.. జబర్దస్త్ వీడడంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Gorantla Madhav: గోరంట్ల మాధవ్ ఒరిజనల్ వీడియో ఉందట! అనంతపురం జిల్లాలో ఎంపీ టూర్ రచ్చ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook