Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 15, 2021 Rasi Phalalu.. వారికి ప్రేమ దొరుకుతుంది
Horoscope Today 15 February 2021: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.
Today Horoscope In Telugu 15 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 15న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈ రోజు మీ కాళ్ల మీద మీరు నిలబడేందుకు యత్నాలు. మేష రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎన్నో ప్రశ్నలు మీకు సవాళ్లుగా మారతాయి. కొంత వేగంగా ఆలోచించి సమాధానాలు అన్వేషిస్తారు. మీకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా మీకు సహాయపడతాయి. అయితే, ఏదైనా చెప్పే ముందు రెండుసార్లు ఆలోచించడం ఉత్తమం.
Also Read: Ram mandir donations: అయోధ్య రామాలయానికి 15 వందల కోట్లు దాటిన విరాళాలు
వృషభ రాశి
ఈ రోజు ప్రేమ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి సంజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారా? లేదా మీ గురించి వారు ఎలా భావిస్తున్నారో మీకు చెప్పాలని ఎదురు చూస్తున్నారా? అయితే ఈరోజు మీరు శుభవార్తలు అందుకోనున్నారు. అన్నింటికి సిద్ధంగా ఉండండి. మీకు దొరికే వాటితో మీరు ఆశ్చర్యపోవచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారికి నేడు మంచి జరగనుంది. నేడు మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే శారీరక శ్రమ కోసం వ్యాయమాలు చేసేందుకు యత్నిస్తారు. ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకుంటారు. మీ అనారోగ్యానికి వెంటనే చికిత్స చేయించుకోవాలి.
కర్కాటక రాశి
పనిలో నిమగ్నమవుతారు. మీ కెరీర్ గాడిన పడాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరు కెరీర్ విషయంపై ఆందోళన చెందుతున్నారా.. అయితే దానిపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. మీ నిర్ణయాన్ని అందరు మెచ్చుకుంటారు. ఇప్పుడు తీసుకునే దారిలో నడిస్తే మేలు జరుగుతుంది.
Also Read: Art of living: రవిశంకర్‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం
సింహ రాశి
సింహ రాశి వారు ఇతరులకు కావాల్సినవి అందిస్తుంటారు. పలు అంశాలలో సహాయం చేస్తారు. ఇది చాలా మంచి విషయం. ఎవరికైనా సహాయం చేయడానికి కొంత సమయం కేటాయిస్తారు. అవసరమైన స్నేహితుడికి మాత్రమే సహాయం చేయండి. మీకు మేలు చేకూర్చే వాటిపై శ్రద్ధ వహించడంలో జాప్యం చేయకూడదు.
కన్య రాశి
మీ ఆలోచనలు, భావనలు కన్యా రాశి వారికి నేడు తప్పిదం అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్నవారు మీ గురించి భిన్నంగా ఆలోచిస్తారు. వాటి గురించి ఆలోచించి చింతించవద్దు. అందుకు కారణాలు తెలుసుకుని ముందుకుసాగాలి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారికి మీరు ఎలా ఉంటారో తెలుస్తుంది. ఇతరుల నుంచి మీకు ఉపకారం జరగదు.
తులా రాశి
ఈ రోజు మీకు ఏం అందుతుందో తులా రాశి వారు గ్రహిస్తారు. ప్రేమ, వృత్తి లేదా కుటుంబం అయినా.. ప్రతి విషయంలోనూ ఆలోచించి ముందడుగు వేయాలి. మీకు ఈ రోజు కొందరు ద్రోహం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
అసహ్యకరమైన విషయాలు, బాధకు గురిచేసే పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా వ్యవహరించాల్సిన తరుణం ఇది. అయితే జరిగిన చెడును తలుచుకుని బాధపడకుండా, తరుణోపాయం ఆలోచించడంతో సత్ఫలితాలు వస్తాయి. నేడు మీ చెడు సమయం నుంచి విముక్తి పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి నేడు చాలా మంచి రోజు. ఈ రోజు మీరు పని ద్వారా సంతృప్తి చెందుతారు. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. కొన్ని విషయాల నుంచి బయటపడేందుకు తాపత్రయపడతారు. ఇది కొంతమందిని కొద్దిగా అసూయపడేలా చేస్తుంది, కానీ దీనివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు
మకర రాశి
గతాన్ని పట్టుకుని కూర్చోవద్దు. పాత విషయాల నుంచి బయటపడేందుకు యత్నిస్తారు. మీరు సమస్యలను పరిష్కరించడానికి చాలా కష్టపడతారు, కానీ కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి. దీనిపై ఎవరినీ నిందించరాదు. మీకు సహకరించని వ్యక్తులు మీరు చేస్తున్న ప్రయత్నాలకు విలువ ఇవ్వరు. నిన్ను ప్రేమిస్తున్న వారితో ఉంటూ, వారి సలహాలు, సూచనలు తీసుకోవడంతో సత్ఫలితాలు.
కుంభ రాశి
ప్రజల్లోకి వెళ్లడం ఈ రోజు అన్నిటి నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు తిరోగమనంలో ఉన్నట్లు మీకు అనిపించవచ్చు, కానీ ఓ సంఘటన మీ మానసిక స్థితిని ఇంకా పెంచుతుంది. ఒంటరిగా సమయం గడపవద్దు. దీని వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది.
మీన రాశి
మీరు కొంతకాలంగా తప్పించుకుంటున్న సమస్య మళ్లీ మీ ముందుకు వస్తుంది. అయితే దీనిని తప్పించుకునేందుకు మీకు ఏ దారి దొరకదు. అయితే పనులు వాయిదా వేయడం మాని, సాధ్యమైనంత వరకు ముందుకు సాగుతారు. ఏ విషయంలోనూ మీరు దాపరికానికి వెళ్లరు. ధైర్యంగా నిలబడి మీ సమస్యలను ఎదుర్కోండి. మీరు చాలా తెలివైనవారు, మీకు పరిష్కారం సులువుగానే దొరుకుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook