Today Horoscope In Telugu 20 May 2021: నేటి రాశి ఫలాలు మే 20, 2021 Rasi Phalalu, నిరుద్యోగులకు శుభవార్త
Today Horoscope In Telugu 20 May 2021: ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.
Horoscope Today 20 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 20వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మేష రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కేవలం మీకు కావలసిన దానిపై దృష్టిసారించాలి. మీరు వ్యాపారం చేస్తున్న వారైతే, ఈ రోజు రిస్క్ తీసుకోవటానికి, మరో అడుగు ముందుకు వేయడానికి తగిన సమయం. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. కొందరు మీ మాటల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
వృషభ రాశి
మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీకు ప్రతిదీ తెలిసినట్లు అనిపిస్తుంది. దాని ప్రభావం ఇతరులపై పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. కుటుంబంలో కొన్ని విషయాలలో గొడవలు జరుగుతాయి. శక్తికి మించి ఖర్చులు చేయడం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందవు.
మిథున రాశి
నేడు ఎవరితోనైనా సమావేశాన్ని ప్లాన్ చేస్తే, అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడుతుంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టడం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. చాలా రోజుల నుంచి పరిష్కారం లభించని కొన్ని సమస్యలు తీరతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.
కర్కాటక రాశి
కొన్ని విషయాలలో మీరు కోరుకున్న ఫలితాలు అందుకుంటారు. కానీ ఆచితూచి వ్యవహరించడం మరువొద్దు. ప్రతి విషయంలోనూ సర్దుకుపోవడం అంత మంచిది కాదు. ఈరోజు మీకు కలిసొస్తుంది. కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడంతో నూతన విషయాలు చెవిన పడతాయి. అదనపు బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి. వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం కాదు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
సింహ రాశి
కొందరు కొత్త వ్యక్తులు మిమ్మల్ని కలుసుకుంటారు. తీరికలేని పనులతో అలసిపోయిన కారణంగా బయటకు వెళ్లి సరదాగా గడపాలని భావిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగులు గుర్తింపు కోసం మరింతగా శ్రమించక తప్పదు.
కన్య రాశి
ఈ రోజు కొన్ని విషయాలు మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తాయి. అనుమానం ఉన్న విషయం చిన్నదా పెద్దదా అనేది పక్కనపెట్టి.. నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. సమస్యను తెలుసుకుని పరిష్కరించుకుంటారు. కొన్ని పనులు మధ్యలోని వాయిదా పడతాయి. ఖర్చులు అధికం కావడంతో రుణాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది.
తులా రాశి
నేడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నగదుకు సంబంధించి మీకు శుభవార్త కూడా అందుతుంది. అయితే చేతికి వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తారు. కొందరు మిత్రులు సాయం కోరి మీ ఇంటికి వస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
వృశ్చిక రాశి
మీరు దేని గురించి విశ్వసిస్తున్నారో దానిపై ఓ అడుగు ముందుకు పడుతుంది. ఇతరులు తమ అభిప్రాయాలను సైతం మీతో పంచుకుంటారు. మీ మనసు చెప్పిన మాట వినండి. మీకు అంతా శుభాలే కలుగుతాయి. ఇల్లు కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. లేదా మీ పాత ఇల్లును రీడిజైన్ చేసేందుకు డబ్బు సిద్ధం చేసుకుంటారు.
Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే
ధనుస్సు రాశి
ఈ రోజు మార్పులకు స్వాగతం పలుకుతారు. పనిచేసే చోట కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది మీతో పాటు సహోద్యోగులకు మేలు చేస్తుంది. ఒత్తిడి కారణంగా అనారోగ్యం బారిన పడతారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఎనాడైనా లభిస్తుందని ఆలస్యంగా తెలుసుకుంటారు.
మకర రాశి
మీరు తీరిక లేకుండా పని మీద శ్రద్ధ వహిస్తున్నారు. కానీ విశ్రాంతి లేకపోతే అనారోగ్యం బారిన పడతారు. మీ కుటుంబానికి సైతం కొంత సమయాన్ని కేటాయించాలి. మీ స్నేహితులతో బయటకు వెళ్లి రిఫ్రెష్ అవ్వండి. ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితం ఉంటుందని మరువొద్దు. ఖర్చులు అధికం కానున్నాయి. ఉద్యోగులకు లేనిపోని సమస్యలు.
కుంభ రాశి
గతంలో జరిగిన విషయాలు మరచిపోండి. గతాన్ని తలుచుకుని బాధపడితే ఏ ప్రయోజనం ఉండదు. పాత విషయాలు మరిచిపోతే మీకు భవిష్యత్తు ఉంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి చేతికి అందుతుంది. చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయవద్దు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
మీన రాశి
మీరు ఒకే చోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం కాదు. మీ నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఇది తగిన సమయం. పని పూర్తి చేసిన వారికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. కానీ కొన్నిసార్లు మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలని భావిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగులకు పనిచేసే చోట శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook