24 December Horoscope: ఈ రాశుల వారికి గడ్డుకాలం నడుస్తోంది జాగ్రత్త..
Horoscope Telugu: డిసెంబర్ 24 (శుక్రవారం)కు సంబంధించి జోతిష్య నిపుణులు చెబుతున్న రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మరి ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి.
Horoscope prediction today: నేడు శుక్రవారం (డిసెంబర్ 24). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
2021 డిసెంబర్, 24 (శక్రవారం)
సూర్యోదయం ఉదయం 6:31 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:28 గంటలకు
తిథి- మార్గశిర బహుళ పంచమి మ.3:58 నిమిషాల వరకు తదుపరి బహుళ షష్ఠి
రాహుకాలం: ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8.42 గంటల నుంచి 9.26 గంటల వరకు
యమగండము: మధ్యాహ్నం 03:00 గంటల నుంచి 4:30 గంటల వరకు
అమృత ఘడియలు: ఉదయం 10.51 గంటల నుంచి మధ్యాహ్నం 02.31 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
ఈ రోజు మీరు తలపెట్టే పనులను ఒకటికి పది సార్లు పరిశీలించుకోండి. మీ చూట్టు ఉండేవారే మీకు ద్రోహం తలపెట్టొచ్చు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, ఒప్పందం చేసుకోవాల్సివచ్చినా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కాస్త ఊరట లభిస్తుంది.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు మీ వృత్తి, మీ వ్యక్తిగత జీవితం మధ్య అసమతుల్యత ఉండవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో సరదాగా గడుపుతున్నారు. మీ కెరీర్‌ను దెబ్బతీసే సంఘటన జరగొచ్చు. మీ కోసం మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది సమయం. నిరుత్సాహ పడే సంఘటనలు చోటు చేసుకోవచ్చు.
మిథున రాశి (Gemini)
కుటుంబ వాతావరణ సానుకూలంగా ఉంది. స్నేహితులు, బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పై స్థాయి అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి నేడు కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. ఇంటా, బయట సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే కష్టకాలంలో కుటుంబం మీకు అండగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాలను వాయిదా వేయడం లేదా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
సింహ రాశి (Leo)
ఈ రాశి వారికి నేడు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యా రాశి (Virgo)
నేడు ఈ రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ నిజాయితే మీకు రక్ష. ఆర్థికంగా కాస్త ఇబ్బంది రావచ్చు. వ్యాపారులకు గడ్డుకాలం నడుస్తోంది. కుటుంబ విషయంలో జాగ్రత్త అవసరం.
తుల రాశి (Libra)
ఈ రాశి వారికి నేడు మిశ్రమంగా ఉంది. వాహన కొనుగోలు యోగ్యం ఉంది. కొత్త పరిచయాలు మేలు చేయొచ్చు. కలుపుగోలుగా వ్యవహరించడం వల్ల ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశివారికి ఆర్థికంగా అంతగా బాగాలేదు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. అనవసర భయాలు పెట్టుకోవద్దు. ఉద్యోగులు పై స్థాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ధనుస్సు రాశి (Sagittarius)
అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాలోచనలతో ముందుకు సాగాల్సిన సమయమిది. మానసికంగా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆహ్లాదకరంగా గడుపుతారు.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారు నేడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. తెలిసిన వారి నుంచే ఇబ్బందులు రావచ్చు. కీలక వ్యవహారాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఉద్యోగుల్లో పని భారం అధికమవ్వచ్చు. దూరపు ప్రయాణాలు అంత మేలు చేయవు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు స్నేహితుల సలహాలు మేలు చేస్తాయి. దూరపు ప్రయాణాలు ఫలితాలనిస్తాయి. స్థిరాస్తి వ్యాపారులకు సానుకూలతలు పెరుగుతాయి.
మీన రాశి (Pices)
నేడు ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చేసే పనికి ప్రతి ఫలం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రోత్సహకాలు అందుతాయి. వ్యాపారాలకు కలిసి వస్తుంది. వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: trigraha yoga: కొత్త సంవత్సరంలో మకర రాశిలోకి మూడు గ్రహాలు...ఆ రాశుల వారికి చాలా ఇబ్బందులు
Also read: Shoonya masam 2021 : శూన్యమాసంలో ఆ పనులు అస్సలు చేయకండి.. ఇవి కచ్చితంగా చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook