Horoscope Today 29 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 29వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
కనిపించిన ప్రతి విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మానేసి, మీ జీవితంలో ఏది అవసరమో ఆ విషయాలను తెలుసుకోండి. నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. మీ కలను సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. ఆర్థిక సమస్యల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు దక్కవు.


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos


వృషభ రాశి
సాధారణంగా పురోగతి సాధించే కొన్ని విషయాలపై దృష్టిసారించడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మీరు చేసే పనులపై విమర్శలు వస్తాయి. కానీ వాటిని పట్టించుకోకుండా సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది.


మిథున రాశి
మీ చుట్టుపక్కల వ్యక్తులు తప్పులు చేస్తుంటా, కానీ మీరు వాటిని పట్టించుకోకుండా మీ పనిపై ధ్యాస కొనసాగించాలి. కొన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. తోబుట్టువులలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కాబట్టి ఈ రోజు వారిపై శ్రద్ధ వహించాలి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు సానుకూల ఫలితాలు అందుకుంటారు.


కర్కాటక రాశి 
వ్యాపారులకు మరియు ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తిలో పెట్టుబడులు పెట్టడం ఈ రోజు మీకు మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. తద్వారా ఇతర పనులు చేపట్టేందుకు రుణాల కోసం యత్నిస్తారు. ఇది మీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే మూల్యం చెల్లించుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


సింహ రాశి
ఈ రోజు మీరు ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు ఆర్థిక సమస్యలకు కారణమవుతాయని గ్రహించి నడుచుకుంటారు. మీ మాటతీరుతో ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య సమస్యలను పరిష్కరిస్తారు. పనిచేసే చోట గుర్తింపు దక్కనుంది. మీ శ్రమను గుర్తించి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. వ్యాపారస్తులు పెట్టుబడులలో కొన్ని మార్పులు కోరుకుంటారు.


కన్య రాశి
పని సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో మీ తోటి సిబ్బంది మీకు సహాయం అందిస్తారు. మీ యజమాని మీ నాయకత్వ నైపుణ్యాలను ప్రశంసిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.  మీ తోబుట్టువులు సహాయం కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారు. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి.


తులా రాశి
మీ మంచితనం, మాటకారితనం కెరీర్‌లో మరియు మీ వ్యక్తిగత జీవితంలో అన్ని సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడతాయి. మీరు ఇతరులతో మర్యాదగా నడుచుకుంటారు. మీరు పనిచేసే చోట కష్టపడుతున్నట్లు మీ తల్లిదండ్రులు గమనిస్తారు మరియు మీకు సహాయం చేయాలని యత్నిస్తారు. విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించాలని భావిస్తారు. ఆర్థిక సమస్యలతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.


వృశ్చిక రాశి
ఈ రోజు ఒంటరిగా ఉండవలసిన అవసరాన్ని గుర్తిస్తారు. మీకు ఏం కావాలి, మీ చుట్టుపక్కల వ్యక్తులు మీ నుంచి ఆశిస్తారని ఆలోచనలో మునుగుతారు. మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నందున మీ జీవిత భాగస్వామికి కోపం వచ్చే అవకాశం ఉంది. రోజు చివర్లో ఆఫీసు నుండి కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొన్ని చికాకులు తప్పవు.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


ధనుస్సు రాశి
ప్రేమ లాంటి విషయాలుకు ఈరోజు దూరంగా ఉండాలి. మీ కెరీర్, మీ పనిపై దృష్టిసారించండి. మీ జీవితంలో కీలక అడుగులు వేసేందుకు బాటలు మీరే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు ప్రమోషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సాయంత్రం వేళ సమావేశమై సరదాగా సమయాన్ని గడుపుతారు. అనారోగ్యం బారిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు ఏర్పాడుతాయి. దైవ చింతన పెరుగుతుంది.


మకర రాశి
ఈ రోజు ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ పనిలో తలెత్తే సమస్యలను విశ్లేషించాల్సి ఉంటుంది. పని ఒత్తిడిని అధిగమించేందుకు తోటి ఉద్యోగులు మీకు సహాయం చేస్తారు. విద్యార్థులు తమ చదువు, భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. వ్యాపారులకు అంతా సవ్యంగానే ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చాలా వద్దా అని యోచిస్తారు.
 
కుంభ రాశి
కొత్త ఆదాయ వనరులు అన్వేషిస్తారు. కొత్త వ్యక్తి మీ వ్యాపారంలో కొత్త భాగస్వామి కావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. సృజనాత్మకతకు సంబంధించిన ఉద్యోగాలను ఎంచుకుంటారు. పనిచేసే చోట ఎదురయ్యే సమస్యలను సులువుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.


మీన రాశి
గతంలో ప్రేమించిన వ్యక్తులు ఈరోజు మీకు కనిపిస్తారు. పనిచేసే చోట మీ యజమానులు మీరు ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ ప్రాజెక్టులపై పని చేయాలని కోరుకుంటారు. ఆరోగ్యం సహకరించినందున చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇష్టమైన వ్యక్తులతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. చేతికి నగదు అందుతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook