Horoscope Today 30 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 30వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఒకేసారి పలు ప్రాజెక్టులు, పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. తద్వారా పని భారం అధికం కానుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. చర్చించుకుని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. నేడు మీకు ధనవ్యయం గోచరిస్తుంది.


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos


వృషభ రాశి
ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. తత్ఫలితంగా మరిన్ని ప్రయోజనాలు మీ దారికి రానున్నాయి. ఉద్యోగాలలో మార్పులు, లేదా కెరీర్ మార్పు కోసం యోచిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఇది తగిన సమయం. వ్యాపారులకు లాభాసాటిగా ఉంటుంది.


మిథున రాశి
ఈ రోజు మీరు సాహసాలు ప్రదర్శించాలని భావిస్తారు. కానీ ముందువెనకా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. మీ మనసు మాట విని అడుగులు వేయండి. చంద్రుడి ప్రభావంతో మీకు నేడు అంతా శుభమే జరగనుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.


కర్కాటక రాశి 
గతంలో ఒకరికి చేసిన వాగ్దానం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టనుంది. వాగ్దానాన్ని పూర్తి చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. మీ శక్తిసామర్థ్యాలను నమ్మి పనులను ప్రారంభించాలి. ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక పరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కుటుంబంలో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం కానుంది. 


సింహ రాశి
మీరు మీ వృత్తికి సంబంధించి ఏ పనులు ఈరోజు చేయడం లేదు.  మీరు ప్రయోజనకరమైన ఇతర విషయాల పట్ల ఆకర్షితులవుతారు. లేదా మీరు పనిచేసే చోట భారీ మార్పులు కోరుకుంటారు. ఎక్కడికి వెళ్లినా మీ విలువ పెరుగుతుంది. కెరీర్‌లో ముందడుగు వేయడానికి మీ ప్రయత్నాలను పునరుద్ధరించండి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడికి తగినట్లు లాభాలు అందవు.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


కన్య రాశి
పని చేసే ముందు మొదట మీ లక్ష్యాన్ని నిర్ధేశించుకోండి మరియు ఆ తరువాత ఈ రోజు వృద్ధి సాధిస్తారని నమ్మకం ఉంచాలి. మీరు గతంలో నేర్చుకున్న పనులకు సంబంధించి పత్రాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. నూతన ఇల్లు సాకారం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు లాభాసాటిగా ఉంటుంది. 


తులా రాశి
మీ నైపుణ్యం, పనితనం మిమ్మల్ని ఈ రోజు మరో దశకు తీసుకెళ్తుంది. ఒకవేళ మీకు ఏదైనా కొత్త పని దొరికితే కచ్చితంగా అందుకు అంగీకారం తెలపడం ఉత్తమం. చిన్న చిన్న లోటుపాట్లు ఉండటం సహజమే. దాని గురించి అతిగా ఆలోచించవద్దు. అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. 


వృశ్చిక రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీకు మద్దతు తెలిపేవారికి సైతం నేడు ప్రయోజనం చేకూరనుంది. కొత్త విషయాలను ప్రవేశపెట్టడానికి యత్నిస్తారు. కాస్త ఆలస్యమైనా అనుకున్నది సాధించి తీరతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదర్శనాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు.


ధనుస్సు రాశి
అధికారం చెలాయించడానికి ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. సన్నిహితులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి అధికం కానుంది. లాభాల కోసం అన్వేషిస్తూ నష్టాల భారిన పడే అవకాశం ఉంది. ఓ అవకాశం మీ తలుపు తట్టనుంది. దాని ఆధారంగా మీ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తారు.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


మకర రాశి
మీరు ఒంటరిగా పనిచేస్తుంటే అది మీకు ఎంత మాత్రం ప్రయోజనకారి కాదు. ఇతరులకు సహకరించండి, అదే సమయంలో వారి నుంచి సహాయం తీసుకుని మీ లక్ష్యాల వైపు పయనిస్తారు. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. చేపట్టిన పనులు పూర్తి కావడానికి తీవ్రంగా శ్రమిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు, హోదా లభించనున్నాయి.
 
కుంభ రాశి
నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. మీరు ఏదో విషయం గురించి ఆలోచిస్తూ అధికంగా భయాందోళనకు గురవుతారు. అయినప్పటికీ మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఉత్తమం. మీకు ఏం కావాలో తెలుసుకునేందుకు సమయాన్ని కేటాయించాలి. మీతో నమ్మకంగా వ్యవహరిస్తున్న వారితో కీలక విషయాలపై చర్చిస్తారు.


మీన రాశి
మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలపై చర్చలు జరపండి. అందరి ప్రయోజనాల కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికం కానున్నాయి. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. అనారోగ్య సమస్యల బారిన పడతారు. పనిచేసే చోట మార్పులు చోటుచేసుకోనున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook