Horoscope Today August 16th : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి సంతోష సమయం.. ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్యాభర్తలు మళ్లీ ఒక్కటవుతారు

Horoscope Today August 14th 2022: ఇవాళ మంగళవారం. శ్రావణ మంగళవారం కూడా విశేషం. ఈ మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం చేస్తే వివాహిత స్త్రీలకు శుభ ఫలితాలు కలుగుతాయి.
Horoscope Today August 16th 2022: ఇవాళ మంగళవారం. శ్రావణ మంగళవారం కూడా విశేషం. ఈ మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం చేస్తే వివాహిత స్త్రీలకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ మంగళవారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి (Aries)
ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆఫీసులో మీకు అప్పగించిన పనులన్నీ సకాలంలో చక్కగా పూర్తి చేసి పెడుతారు. పార్ట్‌నర్స్‌తో కలిసి బిజినెస్ చేసేవారు బాగా రాణించగలరు. ఆదాయం బాగా పెరుగుతుంది. కొన్ని కీలక డాక్యుమెంట్స్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోతారు. విదేశీ వ్యాపారంలో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ రాశి (Taurus)
శాంతి, సంతోషం దూరమవుతాయి. జీవిత భాగస్వామితో గొడవ జరగవచ్చు. ఇంటికి దూరంగా ఉండే పరిస్థితులు తలెత్తవచ్చు. సామరస్యపూర్వకంగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. ప్రేమ వ్యవహారాలకు అనుకూల సమయం. మీ ప్రేయసి లేదా ప్రియురాలికి గిఫ్టులు అందజేస్తారు. వివాహితులు తమ భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో ఉంటారు.
మిథున రాశి (GEMINI)
మీ నాయకత్వ శైలి మరింత పదునెక్కుతుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నిన్నటిదాకా వెంటాడిన ఒక భయం ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. మీరు సింగిల్ అయితే ప్రేమలో పడే అవకాశం ఉంది. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. మీ రిలేషన్‌షిప్‌లో ఆత్మీయత, అనురాగం మరింత పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే పట్టరాని కోపం అనవసర మనస్పర్థలకు దారితీస్తుంది.
కర్కాటక రాశి (Cancer)
ఆస్తి సంబంధిత లేదా ఇతరత్రా విషయాల్లో టెన్షన్ వెంటాడుతుంది. ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచీ తూచీ మాట్లాడాలి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంట్లోని చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వారికి వీలైనంత ప్రేమను పంచడం చేయాలి. మీ ఫ్యామిలీలో యువతకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి. వారితో స్నేహితుల్లా మెలగాలి.
సింహ రాశి (LEO)
మీ ఆత్మవిశ్వాసం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. బిజినెస్‌పరంగా కన్ఫ్యూజన్‌తో కూడిన నిర్ణయాలు తీసుకోవద్దు. వీలైనంతవరకు నిర్ణయాలను ఇవాళ వాయిదా వేయండి. లేనిపక్షంలో మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి రిస్క్ తప్పదు. కోర్టుల్లో కొనసాగుతున్న కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు, విద్యార్థులకు అనుకూల సమయం.
కన్య రాశి (Virgo)
వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రేయసి లేదా ప్రియుడితో ఎక్కువ సమయం గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కడుపు సంబంధిత సమస్యలేవైనా రావొచ్చు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. రుచికరమైన ఫుడ్‌కి బాగా అలవాటుపడుతారు. అదే సమయంలో ఫిట్‌నెస్ ముఖ్యమని గుర్తించాల్సి ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల సమయం.
తులా రాశి (Libra)
కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. విద్యార్థులకు కలిసొస్తుంది. పిల్లల చదువులకు సంబంధించి మంచి న్యూస్ వింటారు. మీ కటువైన మాటలతో ఇంట్లో సంతోషకర వాతావరణాన్ని చెడగొట్టవద్దు. మీ జోక్స్ కుటుంబ సభ్యులను బాధించవచ్చు. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఉద్యోగంలో ఉన్నవారి ప్రతిష్ఠ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇతరుల నుంచి చాలా గౌరవాన్ని పొందుతారు. బాగా ఆలోచించాకే పెట్టుబడులకు సిద్ధమవ్వాలి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే యువత సక్సెస్ అవుతారు. ఇంటలెక్చువల్ వర్క్స్ చేసేవారి ఆదాయం పెరుగుతుంది. మీకు పరిచయం లేని వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ప్రేమలో ఉన్నవారు ఆ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారు. ప్రేమ బంధం మరింత వికసిస్తుంది. ప్రేమికుల మధ్య మధురమైన భావన ఏర్పడుతుంది. సింగిల్స్ ప్రేమలో పడే అవకాశం ఉంది. మీ ఇంటికి అకస్మాత్తుగా బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ పనులు కొన్ని పెండింగ్‌లో పడిపోవచ్చు.ఇవాళ ఏం చేసినా ప్లానింగ్‌తో చేయండి.
మకర రాశి (Capricorn)
కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువులతో సరదాగా గడుపుతారు. మీ కుటుంబ విషయాలు బయటి వ్యక్తులతో చర్చించవద్దు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు సమసిపోతాయి. పిల్లల ఆరోగ్యం, వారిని పెంచడం పట్ల మరింత శ్రద్ధతో వ్యవహరించాలి.
కుంభ రాశి (Aquarius)
ప్రేమికుల మధ్య మనస్పర్థలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చాలా కాలంగా కొనసాగుతున్న బంధంలో అనుకోని ఆటుపోట్లు ఎదురవుతాయి. ఒక వ్యక్తి కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరగవచ్చు. దంపతుల మధ్య కూడా గొడవలు పెరగవచ్చు. అవతలి వ్యక్తులకు మీ వ్యక్తిగత జీవితంలో ప్రవేశించే అవకాశం కల్పించవద్దు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది.
మీన రాశి (Pisces)
ప్రేమికుల మధ్య అనుకోని మనస్పర్థలు తలెత్తవచ్చు. ఇద్దరిలో ఒకరు కాస్త తగ్గితే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. పరిస్థితులు మిమ్మల్ని గందరగోళపరుస్తాయి. గజిబిజి ఆలోచనలు చుట్టుముడుతాయి. వైవాహిక జీవితం ఆశించినట్లుగా ఉండదు. మీ వివాహానికి సంబంధించి కోర్టు కేసుల నుంచి బయటడుతారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్యాభర్తలు మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: CM Kcr: తెలంగాణలో రేపే సామూహిక జాతీయ గీతాలాపన..ఎక్కడివారెక్కడే గప్‌చుప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook