Horoscope Today August 2nd 2022:  ఇవాళ మంగళవారం. హిందువులు హనుమంతుడిని పూజిస్తారు. ఇది శ్రావణ మంగళవారం కావడంతో మంగళ గౌరీ వ్రతం చేస్తారు. అంతేకాదు, ఇవాళ నాగ పంచమి కూడా. ఇన్ని విశేషాలు కలిగిన ఈరోజు ఏ రాశి వారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూల సమయం. విదేశాల్లో వ్యాపారం చేస్తున్నవారికి లేదా విదేశీ కంపెనీలకు అనుబంధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి అనుకూల సమయం. విదేశీ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారికి కూడా ఇది పూర్తిగా అనుకూల సమయం. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా వివాదాలుంటే తొలగిపోతాయి. ఇందులో మీరు కీలక పాత్ర పోషిస్తారు. 


వృషభ రాశి (Taurus)


ఇవాళ కొత్త బిజినెస్ ప్రారంభానికి ప్లాన్ చేస్తారు. ఉద్యోగస్తులకు ఇవాళ సానుకూల సమయం. ఉద్యోగపరంగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా హోల్ సేల్ వ్యాపారులకు ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తలెత్తవచ్చు. ఒకరిపట్ల ఒకరికి అనుమానం కలిగించేలా ప్రేమ జంట ప్రవర్తన ఉంటుంది. ఇది సాఫీగా సాగుతున్న ప్రేమ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పుల సమస్యలు రావొచ్చు.


మిథున రాశి (GEMINI)


ఇవాళ మీకు కలిసొస్తుంది. మీ పట్ల అందరికీ గౌరవం పెరుగుతుంది. బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. ఆదాయం బాగుంటుంది. తద్వారా కొత్త ప్రాజెక్టులు చేపట్టే ఆలోచన చేస్తారు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుని లాభదాయకంగా మలుచుకోగలుగుతారు. ఈ క్రమంలో ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది. అవతలి వ్యక్తి ఒకరితో వివాదం ఏర్పడవచ్చు. అనుకోని వివాదంలో చిక్కుకుంటారు. పెద్దలు, సీనియర్లు అనుభవపూర్వకంగా చెప్పే సలహాలతో మంచి ఫలితాలు పొందుతారు.


కర్కాటక రాశి (Cancer) 


గట్టిగా కష్టపడేందుకు తగిన మోటివేషన్ లభిస్తుంది. ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్నవారికి ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. కొత్త జాబ్ పొందే అవకాశం వస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబపరంగా సంతోషంగా గడుపుతారు. ఇంటికి సంబంధించిన సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలరు. వైవాహిక జీవితంలో విభేదాలను పక్కనపెట్టి దంపతులు ఇరువురు క్వాలిటీ సమయాన్ని గడుపుతారు.


సింహ రాశి (LEO)


వ్యక్తిగత పనులు వాయిదా పడుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల చేత తగిన గుర్తింపు, గౌరవం పొందుతారు. ట్రావెలింగ్ రంగంలో ఉన్నవారికి ఇవాళ శుభదినం. కుటుంబ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. పాత జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటారు. తోబుట్టువులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సంబంధిత విషయాలు బయటి వ్యక్తులతో చర్చించవద్దు. మీరు అవివాహితులైతే మీకు తగిన జోడీ దొరికే అవకాశం ఉంది.


కన్య రాశి (Virgo)


ఇవాళ మీకు శుభదినం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. బిజినెస్ చేసేవారికి ఇవాళ కలిసొస్తుంది. చేపట్టిన ప్రతీ పని సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఉంటాయి. ఆఫీస్ పని విషయంలో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత, వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. మీ ఫోకస్ అంతా కుటుంబం పైనే ఉంటుంది.వృత్తిపరమైన ఒత్తిడిని, భారాన్ని వైవాహిక జీవితం ద్వారా అధిగమిస్తారు. మీ జీవితభాగస్వామితో తగిన సమయం గడపడం ద్వారా రిలాక్సేషన్ ఫీల్ అవుతారు.


తులా రాశి (Libra)


చేపట్టిన పనుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. పని ప్రదేశంలో వాస్తు మార్పులు సత్ఫలితాలను ఇస్తాయి. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. లేదా వారి నుంచి ఏదైనా విలువైన గిఫ్ట్ పొందుతారు. అవివాహితులకు తగిన జోడీ దొరికే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి.


వృశ్చిక రాశి (Scorpio)


వ్యాపారస్తులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పేపర్ వర్క్ విషయంలో. ఎక్కడా ఏ చిన్న తప్పు దొర్లకుండా చూసుకోవాలి. చెడు సహవాసాల జోలికి వెళ్లవద్దు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. వైవాహిక జీవితం చాలా సాఫీగా ముందుకెళ్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. ఆరోగ్యపరంగా ధ్యానం, యోగం చాలా మేలు చేస్తాయని గుర్తిస్తారు.


ధనుస్సు రాశి (Sagittarius)  


బిజినెస్‌లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపార విస్తరణ పనుల్లో సక్సెస్ అవుతారు. చిట్ ఫండ్ లాంటి కంపెనీల్లో పెట్టుబడులకు ఇది సానుకూల సమయం. వైవాహిక జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. జాగ్రత్తగా, శ్రద్ధగా వాటిని పరిష్కరించుకోగలగాలి. ప్రేమికులు ఇది సాధారణ రోజు. కలిసి ప్రయాణించే అవకాశం ఉండొచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది.


మకర రాశి (Capricorn) 


వ్యాపారంలో లాభాలు ఉంటాయి. జాబ్ కోసం ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేవారు సక్సెస్ అవుతారు. బద్దకం మిమ్మల్ని వెనక్కి లాగుతుంటుంది. అయితే అదృష్టం మీ వెన్నంటే ఉండటం కలిసొస్తుంది. కొన్ని కొత్త పనులు చేపట్టేందుకు కావాల్సిన స్పూర్తిని పొందుతారు. స్థిరాస్తి వివాదాల్లో కొత్త టెన్షన్ నెలకొంటుంది. వివాదాలపై మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం, అనవసరంగా మాటలు జారవద్దు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో గొడవలు జరగవచ్చు. ప్రేమికులు సంతోష సమయం గడుపుతారు.


కుంభ రాశి (Aquarius)


ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు తమ ప్లాన్స్ మంచి ఫలితాలనిస్తాయి. బిజినెస్ పార్ట్‌నర్ సపోర్ట్‌తో ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఉద్యోగస్తులు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. కొన్ని కారణాల చేత మనసు కలత చెందవచ్చు. వైవాహిక జీవితం ప్రేమమయంగా సాగుతుంది. ఒకరినొకరు గౌరవించుకుంటారు. 


మీన రాశి (Pisces) 


కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెడుతారు. కొత్త సెక్టార్‌లోకి అడుగుపెట్టే ఆలోచన చేస్తారు. కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టేవారు అందులో కష్టనష్టాలను తెలుసుకోండి. వీలైతే సీనియర్ల సలహా కోరండి. ఉద్యోగపరంగా ప్రస్తుతం ఉన్న సిటీ నుంచి మరో సిటీకి మారే అవకాశం లేకపోలేదు. ప్రేమికులు తమ పార్ట్‌నర్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: NTR's Daughter Uma Maheshwari Death LIVE Updates: ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్న నందమూరి కుటుంబసభ్యులు


Also Read: India vs West Indies: ఆలస్యంగా ప్రారంభంకానున్న రెండో టీ20 మ్యాచ్‌..కారణం అదే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook