Horoscope Today August 6th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది..
Horoscope Today August 6th 2022: : ఇవాళ శనివారం. హిందువులు శనిదేవుడిని పూజిస్తారు. శనీశ్వరుడి అనుగ్రహం సకల దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Horoscope Today August 6th 2022: ఇవాళ శనివారం. హిందువులు శనిదేవుడిని పూజిస్తారు. శనీశ్వరుడి అనుగ్రహం సకల దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది. శనీశ్వరుడి మీవైపు చూడకుండా ఉండాలంటే భగవాన్ హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించాలి. మరి ఈ శనివారం రాశిచక్రంలోని ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం
మేష రాశి (Aries)
కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఒక పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ రావొచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు పనిభారం కారణంగా ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగం మారాలనుకునేవారు కొత్త ఉద్యోగంలో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటనేవి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వీలైతే సీనియర్ల సలహా కోరాలి. విదేశీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారికి ఇవాళ సాధారణ ఫలితాలే ఉంటాయి.
వృషభ రాశి (Taurus)
ఆర్థిక పురోగతి మీ కుటుంబంలో కొత్త సంతోషాలు తీసుకొస్తుంది. వ్యాపారపరంగా రెట్టింపు లాభాలు పొందుతారు. లాభదాయకంగా ఉండే కొత్త ఆర్డర్స్ అందుతాయి. పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాల్సి ఉంటుంది. లక్ష్య సాధనకు మీరు వేసే ప్రణాళికలు వర్కౌట్ అవుతాయి. చేపట్టిన పనులు సక్సెస్ అవడం సంతోషం కలిగిస్తుంది. పని ప్రదేశంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కొందరు మంచి వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మిథున రాశి (GEMINI)
వ్యాపారంలో బాగా అనుభవం ఉన్న ఓ వ్యక్తి నుంచి సలహాలు స్వీకరిస్తారు. వాటిని ఆచరణలో పెట్టడం వల్ల మున్ముందు మంచి ఫలితాలు పొందుతారు. పిల్లలను సరైన దారిలో నడిపేందుకు వారిని గైడ్ చేయండి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో వేగం పెంచుతారు. వ్యాపార కార్యకలాపాలు చకచకా ముందుకు సాగుతాయి. మీలో నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి.
కర్కాటక రాశి (Cancer)
మీ పట్ల మీరు చాలా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. డయాబెటీస్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. జంక్ ఫుడ్ జోలికి వెళ్లవద్దు. మీ తెలివితేటలు, నైపుణ్యంతో లక్ష్యాలను సాధించగలరు. కెరీర్‌లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్మార్ట్ వర్కింగ్ పెరుగుతుంది.మీ పనితీరు అందరికీ నచ్చుతుంది.
సింహ రాశి (LEO)
మీరు కొనసాగుతున్న రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. పెట్టుబడిదారులకు అనుకూల సమయం. పని ప్రదేశంలో మీ సహోద్యోగులు మీ భావజాలానికి ఆకర్షితులవుతారు. ఉద్యోగ మార్పు ఉండొచ్చు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం దక్కుతాయి.
కన్య రాశి (Virgo)
ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు మునుపటికన్నా మెరుగవుతాయి. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. దుబారా తగ్గించుకోని పక్షంలో కష్టాలు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇవాళ అనుకూల సమయం. షేర్ మార్కెట్‌లో లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేముందు నిపుణులు లేదా సీనియర్లను సంప్రదించండి.
తులా రాశి (Libra)
ఉద్యోగంలో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వేతనం పెరగడంతో సేవింగ్స్ పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది శుభదినం. కొత్త స్కీమ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. మీ పూర్వీకుల ద్వారా లభించిన ఆస్తి లేదా ఫారిన్ ట్రేడ్ ద్వారా ప్రాఫిట్స్ ఉంటాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇవాళ మీ ఇంటికి బంధువులు రావొచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి నెగటివ్ ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. అందుకు తగిన పరిష్కారం కనుగొంటారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోగలరు. మీ పనికి సంబంధించిన రూమర్స్‌ను పట్టించుకోకండి. పిల్లలతో ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయండి. భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
సొంత వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీకు వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి విక్రయానికి సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తి రంగంలోనే కొత్త పెట్టుబడులకు సిద్ధమవుతారు. షేర్ మార్కెట్ కార్యకలాపాలకు ఇవాళ ప్రతికూల దినం. షేర్ మార్కెట్ పెట్టుబడికి ఇవాళ దూరంగా ఉండటం ఉత్తమం. ఇల్లు లేదా వాహన కొనుగోలుకై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సంపాదనకు, ఖర్చులకు బ్యాలెన్స్ కుదురుతుంది.
మకర రాశి (Capricorn)
వివాహ బంధం సంతోషకరంగా సాగుతుంది. మీ పార్ట్‌నర్స్‌తో ఎక్కువ సమయం గడిపేందుకు వీలు చేసుకోండి. ఇవాళ మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది. పాజిటివ్ ఎనర్జితో రోజును ప్రారంభిస్తారు. తల్లి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. బోధనా రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. వ్యక్తిగత విషయాల్లో ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)
ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు నయమవుతాయి. మైనర్ సర్జరీ జరగవచ్చు. పిల్లల యాక్టివిటీస్ పట్ల దృష్టి సారించండి. మీ టాలెంట్ ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్‌లో పనిచేసేవారికి అంతా అనుకూలంగా ఉంటుంది. ఏ పనిలోనైనా సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి.
మీన రాశి (Pisces)
కుటుంబంలో వివాదాలు సద్దుమణుగుతాయి. పెద్దల ఆశీస్సులతో శుభఫలితాలు పొందుతారు. ఇవాళ మీ ఇంటికి కొత్త అతిథి రావొచ్చు. కోర్టు కేసుల నుంచి బయటపడుతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు పూర్తి అనుకూల సమయం. ప్రత్యర్థులు, శత్రువులు వెనక్కి తగ్గుతారు.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read:
Vice President Elections Live Updates: జగదీప్ ధనకర్ వర్సెస్ మార్గరెట్ ఆల్వా.. భారత కొత్త ఉప రాష్ట్రపతి ఎవరో? |
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook