Horoscope Today Feb 11 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అదృష్టం తలుపు తట్టే ఛాన్స్
Horoscope Today Feb 11 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి స్తిరాస్తి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలకు ఇది అనుకూల సమయం.
Horoscope Today Feb 11 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కలిసొస్తాయి. అకడమిక్ పరంగా పలు రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి కోరుకున్న బదిలీ జరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం ద్వారా అనుకున్న పనులు పూర్తి చేయగలరు.
మేషరాశి ( Aries)
ఖరీదైన లేదా విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. బంధువులు, మిత్రులతో ఏర్పడిన న్యాయపరమైన వివాదాలు త్వరలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అల్పాహారం, కఠినమైన వ్యాయామాలను దాటవేయడం మానుకోండి. అకడమిక్ పరంగా అన్ని విధాలా అనుకూల సమయం.
వృషభ రాశి (Taurus)
టెక్నికల్‌గా మీకున్న స్కిల్స్ కారణంగా మీరు చేపట్టిన వృత్తిలో గణనీయమైన ఎదుగుదల ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. పుట్టుకతోనే మీరు నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకుని ఉంటారు. అయితే ఇతరుల ప్రతిపాదనలను విమర్శించే ధోరణిని విడనాడండి. దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అకడమిక్ పరంగా మీ పట్టుదల, కృషికి తగిన ఫలితం దక్కుతుంది.
మిథున రాశి (GEMINI)
అదృష్టం మీ తలుపు తట్టే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా పెద్ద వరాన్నే పొందే అవకాశం. వ్యాపారులు, దుకాణదారులు వ్యాపార పర్యటన ద్వారా ఎంతో ప్రయోజనం పొందబోతున్నారు. మీ ప్రధాన ఆరోగ్య సమస్యలన్నీ త్వరలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు ప్రతికూల సమయం. ఆ కారణంగా కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశం.
కర్కాటక రాశి (Cancer)
అనుకూల గ్రహ పరిస్థితులు మీకు ఆర్థిక లాభాలను కలిగిస్తాయి. ఒత్తిడితో కూడిన వృత్తిపరమైన జీవితం నుంచి కాస్త రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో టూర్‌ను ప్లాన్ చేసుకోవడం మంచిది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యహారాలకు ఇది ప్రతికూల సమయం. దూరపు బంధువులు సడెన్‌గా ఇంటికి వచ్చే అవకాశం. మీ కృషికి తగిన ప్రశంసలు, గుర్తింపును పొందుతారు. విద్యారంగంలో సానుకూల ఫలితాలు ఆశించవచ్చు.
సింహ రాశి (LEO)
పెట్టుబడికి సంబంధించిన ప్లాన్స్‌ని ఒకటి లేదా రెండు రోజులు వాయిదా వేయడం మంచిది. మీ తోబుట్టువులతో వివాదాలకు దూరంగా ఉండండి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది సరైన సమయం. విద్యార్థులు తప్పనిసరిగా స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. మిమ్మల్ని జడ్జ్ చేసేవారిని విస్మరించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కన్య రాశి (Virgo)
కొత్త ఆదాయ మార్గాలకు అవకాశం ఉంది. ఇంటి విషయాలు కొంచెం ఉద్రిక్తంగా మారవచ్చు. మెరుగైన ఆఫర్ కోసం మీరు ఉద్యోగం మారే అవకాశం లేకపోలేదు. మీ శారీరక శ్రేయస్సు ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని మీరు గ్రహించాలి. బంధువులు, స్నేహితులతో ఆస్తి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న విదేశీ పర్యటనకు ఇది అనువైన సమయం.
తులా రాశి (Libra)
కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. మీ మిత్రులు, సన్నిహితులు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. కొన్ని విషయాల్లో వారు మీకు ఆదర్శంగా నిలుస్తారు. అలా అని ఇతరుల అభిప్రాయాలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయనివ్వొద్దు. మీ ప్రవృత్తిని విశ్వసించండి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు లేదా ఆస్తులకు ఇది మంచి సమయం కాదు.
వృశ్చిక రాశి (Scorpio)
మీ డబ్బును ఒక ప్లాన్ ప్రకారం పెట్టుబడి పెట్టండి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. తల్లిదండ్రుల శ్రేయస్సు పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ రంగంలో పని చేసే వారు సీనియర్ల నుండి శుభవార్తలు వింటారు. అనారోగ్యంతో పోరాడుతున్న వారికి త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆస్తి లావాదేవీలకు ఇది మంచి సమయం. రోజువారీ జీవితంలో హడావిడిని తగ్గించి విశ్రాంతికి ప్రాధాన్యతనివ్వండి. అకడమిక్ పరంగా విజయం మీదే.
ధనుస్సు రాశి (Sagittarius)
ఎటువంటి గొప్ప శుభవార్తలను ఆశించకండి. మీ పిల్లలతో మంచి కమ్యూనికేషన్‌ను కొనసాగించండి. తల్లిదండ్రులను బయటకు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించండి. చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. మీ సహోద్యోగుల నుంచి అన్ని విధాలా మద్దతు లభించే అవకాశం. పాత ఆస్తి నుంచి ఊహించని లాభం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే అవకాశం ఉంది.
మకర రాశి (Capricorn)
ఆర్థిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి. మీ సహోద్యోగులు మిమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. మీ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కుటుంబ సభ్యులతో యాత్ర సంతోషాన్నిస్తుంది. ఆస్తిని కొనుగోలుకు, పెట్టుబడులకు ఇది మంచి సమయం. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఇది అద్భుతమైన సమయమనే చెప్పాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి.
కుంభ రాశి (Aquarius)
చాలా సంవత్సరాల క్రితం అప్పుగా ఇచ్చిన మీ డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. త్వరలో మీ కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావొచ్చు. వృత్తిపరంగా టీమ్ వర్క్ కలిసొస్తుంది. అనారోగ్యకరమైన పోటీకి దూరంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. నగర శివార్లలో ఆస్తిని కొనుగోలు చేయడం లాభదాయకమైన ప్రతిపాదన. ఈ రోజు నిరాశావాద వైఖరికి దూరంగా ఉండండి. మీరు విద్యారంగంలో బాగా రాణించగలరు.
మీన రాశి (Pisces)
వ్యాపారంలో గణనీయమైన లాభాలను పొందే అవకాశం. కుటుంబంతో క్వాలిటీ టైమ్ గడుపుతారు. మీరు కోరుకున్న బదిలీని పొందవచ్చు. వెన్నునొప్పితో బాధపడేవారికి కాస్త ఉపశమనం దొరకవచ్చు. మిమ్మల్ని మీరు వ్యక్తీకరించడానికి సిగ్గుపడకండి. మీ అహాన్ని పక్కన పెట్టండి. యువకులు విదేశాలకు విహారయాత్ర చేయవచ్చు. పెట్టుబడులకు పూర్తి అనుకూల సమయం.
Also Read: Telugu Industry avoid Manchu family: తెలుగు సినిమా వాళ్లు మంచు ఫ్యామిలీని పక్కన పెట్టేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook