Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 08 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి సొంతింటి కల సాకారం
Horoscope Today 08 July 2021: ప్రయణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలు పెడతారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.
Horoscope Today 08 July 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జులై 08వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీ ఉత్పాదకత ఈ రోజు తారాస్థాయికి చేరుకుంది. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. మీ ఆలోచనలను మీ సహోద్యోగులతో పంచుకోవడం మర్చిపోవద్దు, అందువల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గతంలో మధ్యలోనే వదిలేసిన పనులు తిరిగి చేపడతారు.
వృషభ రాశి
ఈ రాశివారు నేడు చాలా ఒత్తిడికి లోనవుతారు. స్నేహితుడు లేదా సహోద్యోగితో కొన్ని విషయాలు చర్చించడానికి సమయాన్ని కేటాయిస్తారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
ప్రయణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలు పెడతారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులు మార్పు కోరుకుంటారు.
కర్కాటక రాశి
రుచికరమైన ఆహారానికి బదులుగా ఆరోగ్యాన్ని అందించే, రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు తీసుకోవాలి. ఈ రోజు కర్కాటక రాశి వారికి చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ పరుగెత్తడం లేదా వ్యాయాయం లాంటి శారీరక శ్రమ చేయడం ఉత్తమం. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సొంతింటి కల సాకారం చేసుకుంటారు.
సింహ రాశి
మీరు శక్తికి మించి పని చేసినా ఫలితం కోసం ఎదురుచూడక తప్పదు. ప్రతి విషయం మీ దారికి రాకపోవచ్చు అని భావిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరగవుతుంది. ఉద్యోగులకు పనిలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
కన్య రాశి
ఈ రోజు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. మీ స్నేహితులు మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని పెద్ద మార్పులు చేసి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడాలి. ప్రయాణాల ద్వారా మీ ఖర్చులు అధికం కానున్నాయి. అనారోగ్య సమస్యలు కుటుంబసభ్యులను భావిస్తాయి.
తులా రాశి
కొన్ని విషయాలను ఇతరులో చర్చింకుండా కుంగిపోతారు. బయటికి వెళ్లి క్రొత్త వ్యక్తులను కలవండి లేదా కొంతకాలం నుంచి మీరు చూడని స్నేహితులతో కొంత సమయం గడపాలి. రోజు చివరలో ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి
మీరు తినడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలు నిర్వహించాలని భావిస్తారు.
ధనుస్సు రాశి
మీరు వెతుకుతున్న దాని కోసం నిఘా ఉంచాలి. ప్రతి విషయాన్ని గమనించడం ద్వారా మీకు కావాల్సింది పొందగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇటీవల చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
మకర రాశి
ఈ రోజు పని నుంకి కాస్త విరామం తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఓ శుభవార్త అందుకుంటారు. మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్న వెంచర్‌లో విజయం మీదే కావచ్చు. ఇతరుల నుండి ఆలోచనలను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
కుంభ రాశి
మీరు సాహసాలకు సిద్ధమయ్యారు. కెరీర్, జీవితంలో మార్పు కోసం చూస్తున్నారు. వేర్వేరు ప్రదేశాల నుండి వేర్వేరు వ్యక్తులతో మాట్లాడటానికి ప్రయత్నించండి. తిండి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడంతో మీ ఒత్తిడి తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మీన రాశి
మీ భాగస్వామితో మొదటి అడుగు వేసి సంభాషణను ప్రారంభించండి. ఎవైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుంటారు. నేడు మీకు వస్తులాభం కలిగే అవకాశాలను సూచిస్తుంది. డబ్బులు మీ చేతికి అందుతాయి. మీ ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రశంసలు అందుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook