Horoscope Today 15 July 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జులై 15వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంటి ఖర్చులకు అవసరమయ్యే కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. పనిచేసే చోట ఉద్యోగులు మరింత ఉత్పాదకత అందిస్తారు. మీకు ఇది చాలా విలువైన సమయం, ఇతరులతో చర్చలు, సమావేశాలు అంటూ టైమ్ వేస్ట్ చేయకూడదని పెద్దలు సలహా ఇస్తారు.


వృషభ రాశి
మీ తల్లిదండ్రులలో ఒకరి అనారోగ్యం కారణంగా మీరు కలత చెందుతారు. తోబుట్టువులు ఈ రోజు మీ సహాయం కోసం పిలిచే అవకాశం ఉంది. పనికి సంబంధిత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో మీరు ఇందుకు సిద్ధంగా ఉన్నారా లేదా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. పనులను పూర్తి చేయడంలో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. 


Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు


మిథున రాశి
మీరు ఈ రోజంతా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయాలని ఆలోచిస్తారు. అదే సమయంలో పనిని రిస్క్‌లో పెడతారు. కొత్తగా పెళ్లయిన వారు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.
గతంలో చేసిన పెట్టుబడులు కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. 


కర్కాటక రాశి
మీ కెరీర్‌లో ప్రయోజనాలను తీసుకొచ్చే కొత్త వ్యక్తిని మీరు ఈ రోజు కలిసే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలని భావిస్తారు. వ్యాపారులకు గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు అందుకుంటారు. ఇంటిని శుభ్రం చేయడానికి కొంత సమయం కేటాయించండి.


సింహ రాశి
ఈ రోజు ఆరోగ్య సమస్యలు అదుపులోకి వస్తాయి. తల్లిదండ్రులలో ఒకరి అనారోగ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. జాప్యం ద్వారా ప్రమాదాన్ని తీసుకొచ్చే పనులను ముందుగానే పూర్తి చేస్తే మంచిది. పుణ్యక్షేత్రాలు దర్శించాలని ప్లాన్ చేస్తారు.


Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్


కన్య రాశి
రాత్రి నిద్ర లేకపోవడం వల్ల మీరు ఈరోజు చాలా నీరసంగా, బద్ధకంగా ఉంటారు. ఇది మీ పనిని ప్రభావితం చేస్తుంది. కుటుంబంలో కొన్ని విషయాలపై చర్చ జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల ద్వారా ఖర్చులు భారంగా మారతాయి. ఉద్యోగులు పనిచేసే చోట సబార్డినేట్ల నుండి సహాయం తీసుకుంటారు. 


తులా రాశి
నేడు మీకు అదృష్టం కలిసిరానుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి సరైన కంపెనీలో అవకాశం లభిస్తుంది. వ్యాపారులకు నేడు లాభసాటిగా ఉండనుంది. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. సన్నిహితుల నుంచి కొన్ని ఆహ్వానాలు అందుకుంటారు.


వృశ్చిక రాశి 
బంధువుల నుండి అందుకునే శుభవార్త ఈ రోజు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని  ఇబ్బందుల్లో పడేస్తారు. అయినా మీరు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నేడు మీరు ఎలక్ట్రానిక్స్‌ పరికరాలపై పెట్టుబడులు పెట్టకపోవడమే శ్రేయస్కరం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సహోద్యోగులు మీ పనులను కష్టతరం చేయవచ్చు. 


Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే


ధనుస్సు రాశి
కుటుంబ సమస్యతో ఈరోజు మీరు తీరిక లేకుండా కనిపిస్తారు. ఇల్లు మారడం, కొత్త ఇల్లు నిర్మాణం లాంటి విషయాలు చికాకు తెప్పిస్తాయి. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు అందవు.


మకర రాశి
గత కొన్ని రోజులుగా తీరిక లేని పనులతో బిజీగా ఉన్నారు. పని నుంచి కాస్త విశ్రాంతి కోరుకుంటారు. అదే సమయంలో కుటుంబానికి సైతం దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ రోజు వివాదాలు సర్వసాధారణం అవుతాయి. కనుక ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.


కుంభ రాశి
సృజనాత్మకతకు సంబంధించిన పనులు చేపడతారు. కొన్ని ఛారిటీ ప్రాజెక్టు పనులతో బిజీగా ఉంటారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. మీరు ఇటీవల మొదలుపెట్టిన కెరీర్‌ను తల్లిదండ్రులు అంగీకరిస్తారు. పిల్లల విజయంపై తల్లిదండ్రులు గర్వపడతారు. చాలా కాలం తరువాత కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు.


మీన రాశి
కుటుంబ విషయాలు కొంత ఘర్షణకు దారితీస్తాయి. తల్లిదండ్రులు మీ నిర్ణయాలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. తోబుట్టువుల మధ్య తగాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు కాస్త విరామం తీసుకోవడం ద్వారా ఉద్యోగార్ధులకు మంచి అవకాశాలు లభిస్తాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook